విజయ్ (Vijay) – లోకేష్ కనకరాజ్ (Lokesh) కలయికలో తెరకెక్కిన మూవీ లియో (Leo ) భారీ అంచనాల నడుమ నిన్న (అక్టోబర్ 19) న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. గతంలో వీరిద్దరి కలయికలో మాస్టర్ మూవీ వచ్చి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో మరోసారి వీరి కలయికలో సినిమా అనగానే అంచనాలు తారాస్థాయికి చేరాయి. తమిళనాట విజయ్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. తెలుగు లో పవన్ కళ్యాణ్ కు ఎలాగైతే అభిమానులు , భక్తులు ఉంటారో..తమిళనాట కూడా విజయ్ కి అలాంటి భక్తులే ఉంటారు. హిట్ ,ప్లాప్ లతో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంటాయి. ఇక లియో విషయంలో కూడా అదే జరిగింది.
We’re now on WhatsApp. Click to Join.
లియో మూవీ (Leo First Day Collections) మొదటి రోజు .. తమిళనాడులో రూ.30కోట్ల గ్రాస్ రాబట్టగా.. తెలుగు రాష్ట్రాల్లో రూ.15కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక కేరళలో రూ.11కోట్ల గ్రాస్ కొల్లగొట్టగా… కర్ణాటకలో రూ.14కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.4కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇలా ఇండియా వైడ్ గా అన్ని భాషల్లో కలుపుకుని రూ.63 కోట్ల నెట్ వసూలు చేయగా.. రూ.74 కోట్ల గ్రాస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఓవర్సీస్ లో రూ.66కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. నార్త్ అమెరికాలో లియో 523 లోకేషన్లలో షోను ప్రదర్శించగా… 371k డాలర్స్ వసూలు చేసింది. ప్రిమియర్స్ షోస్ తో 1,80కె డాలర్స్ వసూలు చేయాగా.. అక్కడ మొత్తంగా 2 మిలియన్ల డాలర్స్ రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.150కోట్ల గ్రాస్ వసూలు చేసినందని ట్రెడ్ వర్గాలు అంటున్నాయి.
Read Also : Kodali Nani : కొడాని నాని కాన్వాయ్‌కి ప్రమాదం.. దుర్గమ్మ దర్శనానికి వెళ్తూ..?