NTR -Neel : NTR మూవీ కి లీగల్ సమస్యలు..?

NTR -Neel : "డ్రాగన్" (Dragon) అనే టైటిల్‌ను ఫిక్స్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ తమిళ్‌లో ఇప్పటికే అదే పేరుతో ఒక సినిమా రిలీజ్ కావడం వల్ల లీగల్ సమస్యలు

Published By: HashtagU Telugu Desk
Ntr Neel Movie

Ntr Neel Movie

ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ (NTR – Prashanth Neel)కాంబినేషన్‌లో వస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ప్రస్తుతం హైప్‌ను సొంతం చేసుకుంది. ఈ ప్రాజెక్ట్‌ను తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని యూనిట్ నిర్ణయించింది. అయితే అన్ని భాషల్లో ఒకే టైటిల్ పెట్టాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్లగా.. “డ్రాగన్” (Dragon) అనే టైటిల్‌ను ఫిక్స్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ తమిళ్‌లో ఇప్పటికే అదే పేరుతో ఒక సినిమా రిలీజ్ కావడం వల్ల లీగల్ సమస్యలు (Legal Issues) తలెత్తాయి.

 

AP : అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్‌ ఏర్పాటుపై ఐటీ శాఖ ఉత్తర్వులు

2025 ఫిబ్రవరి 21న తమిళ్‌లో “డ్రాగన్” అనే టైటిల్‌తో ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఒక సినిమా విడుదలైంది. తెలుగులో అదే సినిమాను “రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్” అనే పేరుతో డబ్ చేయగా, అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం విజయవంతమవడంతో “డ్రాగన్” టైటిల్‌ను మళ్లీ వాడడం కుదరదు అనే పరిస్థితి వచ్చింది. దీంతో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీకి కొత్త టైటిల్ కోసం యూనిట్ ప్రస్తుతం వెతుకుతున్నట్లు సమాచారం.

ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఫస్ట్ షెడ్యూల్‌ ఇప్పటికే పూర్తి చేసుకుంది. త్వరలోనే రెండో షెడ్యూల్ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు ఎన్టీఆర్‌ నటించిన ‘వార్ 2’ మూవీ ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకుంది. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ 2025, ఆగస్టు 14న విడుదల కానుంది. ‘వార్ 2’ మూవీ కూడా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనుండటంతో, ఎన్టీఆర్‌కు రెండో పాన్ ఇండియా హిట్‌గా నిలిచే అవకాశం ఉంది.

100 Cr Offer : రూ.100 కోట్ల ఆఫర్ ను రిజక్ట్ చేసిన నయన్‌తార..ఎందుకంటే..!!

  Last Updated: 31 May 2025, 01:55 PM IST