Site icon HashtagU Telugu

RC15 Scenes Leak: ‘చరణ్, శంకర్’ మూవీ సీన్స్ లీక్.. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న పోస్టర్స్!

Rc15

Rc15

ఈ డిజిటల్ సినిమా యుగంలో కంటెంట్‌ను కాపాడుకోవడం అంత తేలికైన పని కాదని చెప్పడంలో సందేహం లేదు. అయితే పెద్ద హీరోల సినిమాల లీక్‌ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ఆర్‌సి 15. ఈ చిత్రంలోని ముఖ్యమైన సీన్స్ కొన్ని లీక్ అయ్యాయి. RC15 సెట్స్ నుండి నేరుగా స్నాప్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ లీకైన స్నాప్‌లలో రామ్ చరణ్ పీరియాడిక్ లుక్ లో ఉన్నాడు. అలాగే, అంజలి, ఒక పిల్లాడితో చరణ్ ఫ్యామిలీని చూడొచ్చే. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ లీకైన పిక్స్ కూడా నాణ్యత లేనివి. అయినా ఈ HD ఫోటోలు RC15 సెట్స్‌లోని భద్రతా పరిస్థితిపై సందేహాన్ని కలిగిస్తుంది. ఈ లీక్ అయిన పిక్స్ ఇంటర్ నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. మొత్తంగా లీక్‌లు చిత్రానికి పెద్ద నష్టం కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ వాయిదాలపర్వంలో నడుస్తున్న సమయంలో ఈ లీక్స్ మరింత తలనొప్పిగా మారాయి.