Site icon HashtagU Telugu

Laya : అమెరికాలో అడుక్కుతింటు బ్రతుకుతుందనే వార్తలపై లయ క్లారిటీ..

Laya

Laya

ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను , ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించిన హీరోయిన్లు..ప్రస్తుతం పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. వీరిలో కొంతమంది రీ ఎంట్రీ ఇచ్చి అలరిస్తున్న..కొంతమంది మాత్రం ఫ్యామిలీ బాధ్యతలు చూసుకుంటూ పూర్తిగా సినిమాలకు దూరం అయ్యారు. ఆలా దూరమైన హీరోయిన్లలో లయ (Laya) ఒకరు.

We’re now on WhatsApp. Click to Join.

భద్రం కొడుకో సినిమాలో బాల నటిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. స్వయంవరం సినిమాతో హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత ప్రేమించు, మనోహరం, మనసున్న మారాజు, నీ ప్రేమకై, హనుమాన్ జంక్షన్, మిస్సమ్మ, దొంగరాముడు, పెళ్లాంతో పనేంటి, దేవుళ్లు, ఎంత బావుందో, గెలుపు, కోదండరాముడు, నేను పెళ్లికి రెడీ, కొండవీటి సింహాసనం, మా ఆవిడమీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది, మా బాలాజీ, నాలో ఉమ్మ ప్రేమ, నువ్వు లేక నేను లేను, రామ చిలక, రామ్మా చిలకమ్మా, రామ సక్కనోడు, శివరామరాజు, మహాచండి. అదిరిందయ్యా చంద్ర, విజయేంద్ర వర్మ, స్వరాభిషేకం, టాటా బిర్లా మధ్యలో లైలా, బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం వంటి సినిమాల్లో నటించి అలరించింది. కెరియర్ పిక్ స్టేజ్ లో ఉన్న క్రమంలో అమెరికాకు వెళ్లి..అక్కడ సెటిల్ అయినా బిజినెస్ మాన్ ను పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది.

కాగా ఈమె అమెరికా లో అక్కడి రోడ్లపై అడుక్కు తింటుందంటూ గతంలో పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం అయ్యాయి. అలాగే తినేందుకు డబ్బులు కూడా అనేక పనులు చేస్తుందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇది ఎంతవరకు నిజం అనేది తాజాగా ఈమె అలీతో సరదాగా కార్యక్రమంలో క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం తాను ఇక్కడ లేకపోవడంతో.. తనపై అనేక రకాల వార్తలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేసింది. అవన్నీ అబద్ధాలే అని.. తన భర్త ఓ బిజినెస్ మేన్ అని చెప్పుకొచ్చింది. మరీ అంతగా ఆస్తులు లేకపోయినా… అడుక్కు తినే స్థాయికి మాత్రం ఎప్పుడూ రాలేదని స్పష్టం చేసింది. అసలు ఎందుకిలా ఫేక్ వార్తలు సృష్టించి , ఎందుకు బాధపెడతారో అర్ధం కాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read Also : Ram Charan : పాటలతో మొదలు కాబోతున్న RC16.. జాన్వీ పాపతో చరణ్..