కాంచనమాల కేబుల్ టీవీతో తెలుగులో పరిచయమైన లక్ష్మి రాయ్ ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ్ సినిమాలతో బిజీ అయింది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. తాజాగా లక్ష్మి రాయ్ హైదరాబాద్(Hyderabad) లో సందడి చేసింది.
బంజారా హిల్స్, రోడ్ నెం 2లో అమిగాస్ రెస్టోబార్(Amigas Resto Bar) లక్ష్మి రాయ్ ఇటీవల నవంబర్ 5న గ్రాండ్ గా లాంచ్ చేసింది. అమిగాస్ రెస్టోబార్ కేవలం ఫుడ్ అండ్ డ్రింక్స్ స్పెషలిస్ట్ తో పాటు హైదరాబాద్ నైట్ లైఫ్ సెలబ్రేషన్ కూడా . బంజారాహిల్స్ రోడ్ నెం. 2 సూపర్ వైబ్రేషన్‌లో నెలకొల్పబడిన ఈ రేస్తో బార్ మహిళా స్టాఫ్ తో నిర్వహించబడుతోంది, ఇది డైనింగ్ ఎక్స్పీరియన్స్ కి ప్రత్యేకమైన అందాన్ని అందిస్తుంది.
ఇక ఈ రెస్టోబార్ లాంచ్ ఈవెంట్ లో లక్ష్మి రాయ్ మాట్లాడుతూ.. అమిగాస్ రెస్టోబార్ సెలబ్రేషన్ వైబ్స్ ని తలపిస్తుంది , చక్కటి ఫుడ్ మరియు వినోదం కోసం గెస్ట్స్ చిల్ అవడానికి, ఆనందించడానికి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పార్టీస్ జరుపుకునే ఒక డెస్టినేషన్ గా అమిగాస్ రెస్టోబార్ ఉండబోతుంది. హైదరాబాద్‌లో డైనమిక్, నైట్ లైఫ్ కి ఇది చక్కని ప్లేస్. అమిగాస్ రెస్టోబార్‌లోకి అడుగు పెడితే వార్మ్ వెల్కమింగ్ వాతావరణంతో అట్ట్రాక్ట్ అవ్వక తప్పదు. అనేక రుచులతో మెనూ ఉంది. అనేక రుచికరమైన వంటకాలు మరియు చేతితో తయారు చేసిన కాక్‌టెయిల్‌లు ఉన్నాయి అని తెలిపింది.
ఇక ఈ అమిగాస్ రెస్టోబార్ వారంలో అన్ని రోజుల్లో ఉదయం 11 నుండి రాత్రి 11 గంటల మధ్య అందుబాటులో ఉంటుంది. ప్రతి రోజు లైవ్ మ్యూజిక్ తో , డీజే నైట్స్ , లేడీస్ నైట్ రకరకాల మ్యూజిక్ థీమ్స్ కూడా ఉండనున్నాయి.
Also Read : Exclusive: బిగ్ అప్డేట్, రాజమౌళి-మహేశ్ మూవీ షురూ అయ్యేది అప్పుడే