Lavanya Tripathi: టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది. తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. స్టార్ హీరోల అందరి సరసన నటించిన ఈ బ్యూటీ.. విభిన్న రకాల పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తన క్యూట్‌నెస్, అందంతో ఎంతోమంది యువకుల హృదయాలను కొల్లగొట్టింది. ఈ సొట్టు బుగ్గుల సుందరి ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం సినిమాల్లో నటిస్తోంది.
అయితే సినిమాలతో ఎప్పుడూ బిజీా ఉండే లావణ్య త్రిపాఠి తాజాగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంది. అనాథాశ్రమంలో సందడి చేసింది. ఎల్బీనగర్‌లోని ఆనంద విద్యార్థి గృహన్ని మంగళవారం లావణ్య త్రిపాఠి సందర్శించింది. పిల్లలతో కలిసి సరదాగా గడిపిన ఈ బ్యూటీ.. వారితో ఆటపాటలాడింది. విద్యార్థుల ప్రతిభను చూసి ఆశ్చరయోయింది. చాలామంది ఈ అనాథాశ్రమంలో చదివి ఉద్యోగ ఉద్యోగులు స్థిరపడ్డారు. ఈ విషయాన్ని లావణ్య త్రిపాఠి తెలుసుకుని నిర్వాహకులను మెచ్చుకుంది.
అనాధాశ్రమం వ్యవస్థాపకులు మార్గం రాజేష్‌లను లావణ్య త్రిపాఠి కలుసుకుని వివరాలు తెలుసుకుంది. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయడంతో పాటు వారికి కావాల్సిన అత్యవసర మందులను కానుకగా అందించింది. విద్యార్థుల జీవితాలు తను ఎంతో స్పూర్తినిచ్చాయని పేర్కొంది. అయితే ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు లావణ్య త్రిపాఠి ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది. తాను సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి 11 ఏళ్లు ఎన్నో కష్టాలు పడ్డానని, సినిమా ఇండస్ట్రీలో తమ కుటుంబసభ్యులు ఎవరూ లేకపోయినా కష్టపడి వచ్చానంది. తనకు సినిమా అవకాశాలు ఇచ్చిన దర్శకులు, నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపింది. పిల్లలను చూసి ఎంతో నేర్చుకున్నానని తన ఇన్‌స్ట్రాగ్రామ్ లో పోస్ట్ ఉంది. ఇవాళ పిల్లలను కలుసుకుని వారితో సరదాగా మాట్లాడటం చాలా ఆనందాన్ని ఇచ్చిందని లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చింది.