టాలీవుడ్ (Tollywood) లో రూమర్స్ సర్వసాధారణం. పలానా అప్ కమింగ్ హీరోయిన్ స్టార్ హీరోతో డేటింగ్ చేస్తుందనీ, ఓ యంగ్ హీరో, తన పక్కన నటించిన హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగాడని అనే వార్తలు నిత్యం చదువుతూనే ఉంటాయి. అభిమానులు కూడా ఇష్టమైన జంటల గురించి వార్తలు తెలుసుకోవడానికి ఆసక్తిని చూపుతూనే ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లి వార్త గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.
ఇటీవలే తండ్రి నాగబాబు ‘త్వరలో వరుణ్ తేజ్ (Varun Tej) ఓ ఇంటివాడు కోబోతున్నాడు’’ అని ప్రకటించాడు. ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకోబోతున్నాడని, త్వరలో తన కాబోయే వధువు ఎవరనే విషయాన్ని వెల్లడిస్తానని వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు ఇటీవల వెల్లడించారు. నాగబాబు ప్రకటన వెలువడిన రోజూ నుంచి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి వార్త గురించి రుమార్స్ వస్తునే ఉన్నాయి. అందాల రాక్షషి ఫేం లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) తో ప్రేమను నడిపస్తున్నాడని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు హాల్ చల్ చేశాయి. అయితే ఆ వార్తలను నిజం చేస్తూ అందాల భామ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ఆసక్తికర కామెంట్స్ చేయడం అందర్నీ ఆకట్టుకుంది.
మోస్ట్ హ్యాండ్సమ్ యాక్టర్ వరుణ్ తేజ్ అని ఈ బ్యూటీ చెప్పడంతో మరోసారి వైరల్ గా మారింది. ప్రస్తుతం ఆమె పులి మేక వెబ్ సిరీస్‌ను ప్రమోట్ చేస్తోంది. ఇద్దరు నటుల్లో ఎవరు ఎక్కువ ఆకర్షణీయంగా కనిపిస్తారని అడిగినప్పుడు, ఆమె వరుణ్ తేజ్ అని సమాధానం చెప్పింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ల రిలేషన్ గురించి విస్తృతంగా వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి రెండు సినిమాల్లో నటించారు. పెళ్లి గురించి గుసగుసలు వినిపించాయి, కానీ ఈ ఇద్దరు సైలంట్ గా ఉన్నారు.
Also Read: Nikhat Zareen: బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ కు 600 గజాల ఇంటిస్థలం!