చిత్రసీమలో మెగా ఫ్యామిలీ (Mega Family) కి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒక్కడిగా చిత్రసీమలో అడుగుపెట్టిన చిరంజీవి (Chiranjeevi)..ఇప్పుడు ఇండస్ట్రీ కే పెద్ద దిక్కయ్యారు. అంతే కాదు తన ఫ్యామిలీ నుండి దాదాపు డజన్ కు తక్కువ..అరడజను కు ఎక్కువ మందిని చిత్రసీమలోకి తీసుకొచ్చారు. చిరంజీవి పేరుతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటి ఎవరికీ వారు తమ సత్తా చాటుతూ రాణిస్తున్నారు. అలాంటి గొప్ప ఫ్యామిలీలోకి మెగా కోడలిగా లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) అడుగుపెట్టబోతుంది.
మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ (Varun Tej) ను ఈమె వివాహం చేసుకోబోతుంది. సినిమా షూటింగ్ లో మొదలైన వీరి ప్రేమ..ఇప్పుడు పెళ్ళికి దారితీసింది. అతి త్వరలో లావణ్య మేడలో మూడు ముళ్ళు వేయబోతున్నాడు వరుణ్. మెగా ఇంటికి కోడలుగా అడుగుపెడుతుంది లావణ్య..ఇది ఒక రకంగా ఆమెకు బరువైన బాధ్యతనే చెప్పవచ్చు. గతంలో మాదిరి ఇప్పుడు కూడా సినిమాల్లో తన అందచందాలు ప్రదర్శించడం చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఏం చేసినా మెగా కుటుంబంతో పాటు మెగా ఫ్యాన్స్‌ను కూడా దృష్టిలో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. వరుణ్ తేజ్‌తో నిశ్చితార్థం కంటే ముందేఆమె ఒప్పుకున్న కొన్ని సినిమాలను రద్దు చేసుకున్నారట. తాజాగా మరో వెబ్ సిరీస్ కు కూడా నో చెప్పినట్లు తెలుస్తుంది. ‘స్కైలాబ్’ సినిమాకు దర్శకత్వం వహించిన విశ్వక్ ఖండేరావ్ ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించనున్నారు. కొద్దిరోజుల్లో షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ వెబ్ సిరీస్ కు లావణ్య ఓకే చెప్పింది.కాకపోతే ఈ సిరీస్ సెట్స్ పైకి రావడం ఆలస్యం కావడం..ఇంతలో వరుణ్ తో నిశ్చితార్థం జరగడం.త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతుండడం తో ఈ సిరీస్ లో నటించేందుకు ఆమె నో చెప్పిందట. అంతే కాకుండా ఈ సిరిస్ లో కాస్త బోల్డ్ సన్నివేశాలు ఎక్కువగా ఉండడం తో..అందులో నటిస్తే బాగోదని లావణ్య నో చెప్పినట్లు సమాచారం.
Read Also : SRUTHI HASSAN: బ్రౌన్ అవుట్ ఫిట్ లో రచ్చ చేస్తున్న శృతి హాసన్
కొద్దిరోజుల్లో మెగా ఇంటికి కోడలిగా అడుగుపెడుతున్న సమయంలో ఇలాంటి సినిమాలో నటించడం కరెక్ట్ కాదని నిర్ణయించుకున్నదట. ఆ వెబ్‌సిరీస్ దర్శక, నిర్మాతలను పిలిపించి మరొక హీరోయిన్‌ని చూసుకోమని లావణ్య ఓపెన్‌గానే చెప్పేశారట. ఆమె తీసుకున్న అడ్వాన్స్‌ను కూడా తిరిగిచ్చేశారట. ఇక ఈమె తీసుకున్న నిర్ణయం మేకర్స్ కు తలనొప్పిగా మారిన మెగా ఫ్యాన్స్ కు మాత్రం సంతోషాన్ని ఇస్తుంది.