Site icon HashtagU Telugu

Miss Perfect : పెళ్లి తర్వాత లావణ్య ఫస్ట్ వెబ్ సిరీస్.. ‘మిస్ పర్ఫెక్ట్’ టీజర్ చూశారా?

Lavanya Tripathi new series Miss Perfect Teaser Released

Lavanya Tripathi new series Miss Perfect Teaser Released

హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ఇటీవల కొన్ని నెలల క్రితం మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో లావణ్య – వరుణ్ జంట కొన్ని రోజుల పాటు వైరల్ అయ్యారు. వీరి ఫోటోలు, హనీమూన్ ట్రిప్, బయట ఎక్కడ కనపడినా, వీళ్ళ సోషల్ మీడియా పోస్టులు.. ఇలా అన్ని ట్రెండింగ్ లో ఉన్నాయి. పెళ్లి, హనీమూన్.. ఫుల్ గా ఎంజాయ్ చేసి ఇద్దరూ ఇటీవలే మళ్లీ వర్క్ లోకి వెళ్లారు.

వరుణ్ తేజ్ తన నెక్స్ట్ సినిమా మట్కా షూటింగ్ ఆల్రెడీ మొదలు పెట్టాడు. ఇక లావణ్య త్రిపాఠి ఓ తమిళ్ సినిమా చేస్తుండగా తాను నటించిన మిస్ పర్ఫెక్ట్(Miss Perfect) వెబ్ సిరీస్ రిలీజ్ కి రెడీ అయింది. డిస్నీప్లస్ హాట్ స్టార్ లో ఇటీవల కొత్త సిరీస్ లు వరుసగా వస్తున్నాయి. లావణ్య త్రిపాఠి, అభిజీత్, అభిజ్ఞ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన మిస్ పర్ఫెక్ట్ అనే సిరీస్ త్వరలోనే రానుంది. OCD ఉండి అన్ని క్లీన్ గా ఉండాలనుకునే అమ్మాయి పాత్రలో లావణ్య ఈ సిరీస్ లో కనిపించనుంది.

తాజాగా మిస్ పర్ఫెక్ట్ టీజర్ ని విడుదల చేశారు. పెళ్లి తర్వాత లావణ్య మొదట ఈ సిరీస్ తోనే రానుంది. దీని రిలీజ్ డేట్ ని ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం మిస్ పర్ఫెక్ట్ టీజర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ ఓ ఉంది. ఇక ఈ సిరీస్ ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించడం విశేషం. పెళ్లి తర్వాత లావణ్య మొదటగా ఈ సిరీస్ ప్రమోషన్స్ కి మీడియా ముందుకి త్వరలోనే రానుంది. బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన అభిజీత్ చాలా గ్యాప్ తర్వాత ఈ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు.

Also Read : Kalki 2898AD : ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అదే డేట్ రిపీట్ చేస్తున్న వైజయంతి మూవీస్..