వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) గత కొన్నేళ్లుగా సీక్రెట్ గా ప్రేమించుకొని ఇటీవల నిశ్చితార్థం చేసుకొని అందరికి సర్‌ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోబోతున్నారు అని తెలియగానే అంతా ఆశ్చర్యపోయారు. ఇక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న ఈ జంట ఇప్పటికే పెళ్లి షాపింగ్ కూడా మొదలుపెట్టింది.
అయితే తాజాగా నేడు వినాయకచవితి(Vinayaka Chavithi) రోజు అత్తారింట్లో లావణ్య త్రిపాఠి పూజలు చేసి అందరికి షాక్ ఇచ్చింది. నేడు వినాయకచవితి సందర్భంగా నాగబాబు ఇంట్లో కూడా పండగ సెలబ్రేట్ చేసుకున్నారు. నాగబాబు, ఆయన భార్య, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి పూజలు చేశారు. వరుణ్ ఈ ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అయితే పెళ్లి కాకుండానే అత్తారింటికి వచ్చి పూజలు కూడా చేసేస్తుండటంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. పలువురు నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్స్ చేస్తున్నారు. ఇక లావణ్య చీరలో పద్దతిగా కనిపించింది. అయితే లావణ్య త్రిపాఠి పేరెంట్స్ ముంబైలో ఉంటారు. లావణ్య ఇక్కడే హైదరాబాద్ లో ఉంటుంది. ఎలాగో నిశ్చితార్థం అయింది కాబట్టి పండగ పూట ఎవరూ లేకుండా చేసుకోవడం ఎందుకు అని అత్తారింటికి వచ్చినట్టు సమాచారం.
Happy Vinayaka chavithi!
Wishing you all great
health & prosperity. ♥️♥️♥️ pic.twitter.com/3eAdnxatWp— Varun Tej Konidela (@IAmVarunTej) September 18, 2023
Also Read : Brahmanandam : కింగ్ మూవీలో బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్ పాత్ర వెనకున్న కథ..