Lavanya Tripathi : తల్లికాబోతున్నట్లు ప్రకటించిన మెగాకోడలు

Lavanya Tripathi : ఆమె తల్లికాబోతున్నట్టు తెలిసిన వెంటనే మెగా అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. "వెల్‌కమ్ బుల్లి మెగా హీరో" అంటూ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి

Published By: HashtagU Telugu Desk
Lavanya Tripathi And Varun

Lavanya Tripathi And Varun

మెగా ఫ్యామిలీ (Mega Family) మరో శుభవార్త తెలిపింది. మెగా హీరో వరుణ్ తేజ్ భార్య, నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi and Varun Tej ) తల్లికాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని లావణ్య తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఆమె తల్లికాబోతున్నట్టు తెలిసిన వెంటనే మెగా అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. “వెల్‌కమ్ బుల్లి మెగా హీరో” అంటూ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెగా కుటుంబ సభ్యులు ఈ శుభవార్తపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి ఇద్దరూ ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ వంటి సినిమాల్లో కలిసి నటించారు. ఆ సినిమాల్లో కలిసి పనిచేసే సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ప్రేమగా మారి, చివరకు పెళ్లి వరకు దారితీసింది. ఇరు కుటుంబాల అంగీకారంతో వీరి వివాహం నవంబర్ 1న ఇటలీలో గ్రాండ్‌గా జరగింది. పెళ్లి అనంతరం వరుణ్ తన సినిమాలతో బిజీగా మారగా, లావణ్య మాత్రం సినిమాలకు కొంత విరామం ఇచ్చి వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తోంది.

Coke Studio : భారత్, వివిధ సంగీత శైలుల సంగమాన్ని జరుపుకునే ఐకానిక్ వేదిక

పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి ఎక్కువగా సెలెక్టివ్‌గా ప్రాజెక్టులు ఎంపిక చేస్తోంది. ‘మిస్ పర్‌ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్‌తో మాత్రమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ తర్వాత నుంచి కొత్త సినిమాలపై దృష్టి పెట్టకుండా తన వ్యక్తిగత జీవితంలో బిజీ గా మారింది. ప్రస్తుతం తల్లికాబోతున్నాననే వార్తతో మరింత సంతోషంలో మునిగిపోయింది. అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ శుభవార్తతో మెగా ఇంటి వాతావరణం పండుగలా మారింది.

  Last Updated: 06 May 2025, 07:45 PM IST