మొన్నటిదాకా కేవలం హీరోయిన్ గా మాత్రమే ఉన్న లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ఇప్పుడు మెగా ఇంటి కోడలిగా మారి మెగా కోడలిగా మారింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని పెళ్లాడిన లావణ్య మెగా కోడలిగా తన పాపులారిటీ కొనసాగిస్తుంది. ఆఫ్టర్ మ్యారేజ్ లావణ్య చేసిన మొదటి ప్రాజెక్ట్ మిస్ పర్ఫెక్ట్. ఈ సీరీస్ లో అభిజిత్ హీరోగా నటించాడు. డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ అవుతున్న ఈ వెబ్ సీరీస్ ప్రమోషన్స్ లో మెగా కోడలు యాక్టివ్ గా పాల్గొన్నది.
We’re now on WhatsApp : Click to Join
అయితే మెగా కోడలిగా తన ప్రమోషన్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది లావణ్య త్రిపాఠి. అంతేకాదు మెగా కండీషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే అలాంటివి ఏమి లేదని సమాధానం ఇచ్చింది. మెగా ఫ్యామిలీలో భాగమైనందుకు సంతోషంగా ఉందని. ఇక సినిమాల విషయాల్లో ఇలా ఉండు అలా ఉండు లాంటి కండీషన్స్ ఏమి లేవని.. అంతా తనకు నచ్చినట్టుగానే చేయమని అన్నారని చెప్పుకొచ్చింది లావణ్య.
మెగా కోడలు అనే ట్యాగ్ లైన్ కూడా తనకు ఎంతగానో నచ్చిందని. తన సినిమాల సెలక్షన్ లో ఎలాంటి అభ్యంతరాలు లేవని క్లారిటీ ఇచ్చింది. అయితే ఒకరు చెప్పేలా కాదు కానీ లావణ్య అంతకుముందు కూడా తనకు నచ్చిన సినిమాలనే చేస్తూ వచ్చింది. కచ్చితంగా మెగా ఇంటి కోడలిగా మారిన తర్వాత ఆమె ఎంచుకునే కథల్లో మార్పు వస్తుందని చెప్పొచ్చు.
Also Read : Devara Interval Scene : దేవర ఇంటర్వెల్ సీట్లు చిరిగిపోవాల్సిందేనా.. ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కి పండుగే..!