రాజ్ తరుణ్ – లావణ్య (Raj Tarun & Lavanya) ల వ్యవహారం రోజు రోజుకు ఆసక్తిగా మారుతుంది. లావణ్య క్యారెక్టర్ మంచిది కాదని..డ్రగ్స్ తీసుకుంటుందని..తనకు నాకు సంబధం లేదంటూ రాజ్ తరుణ్ తన వాదన వినిపించాడు. మొదట్లో లావణ్యదే తప్పంతా అని అంత అనుకున్నారు..కానీ రాజ్ తరుణ్ కు సంబంధించి అసలు నిజాలు బయటపడుతుండడం తో అంత షాక్ అవుతున్నారు. రాజ్ తరుణ్ ఇలాంటి వాడా..? అని చిత్రసీమ ప్రముఖులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. లావణ్య తరుపున ప్రముఖ లాయర్ , పవన్ కళ్యాణ్ అభిమానులకు శ్రేయోభిలాషి దిలీప్ సుంకర వాదిస్తుండడం తో ఈ కేసుకు సంబంధించి మరింత ఆసక్తి పెరిగింది.
We’re now on WhatsApp. Click to Join.
నిన్న రాత్రి లావణ్య ఆత్మహత్య యత్నానికి ట్రై (Lavanya Suicide Attempt) చేయడం ..ఈ కేసుకు బలం చేకూరినట్లు అయ్యింది. రాజ్ తరుణ్ లేకుండా తాను బతకలేనని, ఆత్మహత్యే శరణ్యమంటూ లేఖ రాసి తన తరపున ఈ కేసు వాదిస్తున్న కల్యాణ్ దిలీప్ సుంకరకు పంపింది. వెంటనే ఆయన అలెర్ట్ అయ్యి.. లావణ్య ఫ్లాట్ కు పోలీసులు పంపించాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు లావణ్య కు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. లావణ్య ఇలాంటి పరిస్థితుల్లో ఏ పిచ్చి నిర్ణయం తీసుకొన్నా, అది రాజ్ తరుణ్ కెరియర్ ఫైనే కాదు తన జీవితం ఫై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటీకే అవకాశాలు లేక రోడ్డున పడే పరిస్థితి కి వచ్చిన రాజ్ కు ఈ లావణ్య నిద్ర కూడా పోనివ్వడం లేదు.
మొన్నటి వరకు లావణ్య తో సెటిల్మెంట్ కోసం రాజ్ తరుణ్ గట్టిగానే ట్రై చేసాడు..తనతో పాటు కాస్త పేరున్న వ్యక్తులతో కూడా లావణ్య తో మాట్లాడే ప్రయత్నాలు చేసాడు కానీ లావణ్య మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. ‘నాకు రాజ్ తరుణ్ కావాల్సిందే’ అని పట్టుబడుతోంది. తన పేరు మీద ఉన్న విల్లాతో పాటు, కొంత నగదు ఇస్తానని రాజ్ తరుణ్ సంప్రదింపులు మొదలెట్టాడు. కానీ లావణ్య మాత్రం తనకు డబ్బుతో పని లేదని రాజ్ తనను పెళ్లి చేసుకోవాల్సిందే అని కూర్చుంది. రాజ్‌తరుణ్‌తో తనకు పెళ్లయ్యిందని నిరూపించే సాక్ష్యాలు లావణ్య దగ్గర బలంగా ఉన్నాయి. దాదాపు 170 పైచిలుకు సాక్ష్యాల్ని పోలీసుల ముందు ఉంచింది. ఇవే ఈ కేసులో కీలకం కానున్నాయి. ఇప్పుడు రాజ్ తరుణ్ ముందున్నవి రెండే రెండు మార్గాలు. ఒకటి.. లావణ్యతో కలిసి కాపురం చేయడం, లేదంటే ఈ వ్యవహారం కోర్టులో తేల్చుకోవడం. త్వరగా ఏదోకటి చేసుకోకపోతే..తాన్ కెరియర్ ఫై తీవ్ర ప్రభావం చూపడం ఖాయమని సినీ విశ్లేషకులు, తరుణ్ స్నేహితులు చెపుతున్నారు.
Read Also : Raj Tarun & Lavanya Issue