RJ శేఖర్ బాషా (Shekar Basha) నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ రాజ్ తరుణ్ (Raj Tarun) మాజీ లవర్ లావణ్య (Lavanya) పోలీసుల్ని ఆశ్రయించారు. గత కొద్దీ రోజులుగా మీడియా లో రాజ్ తరుణ్ – లావణ్య – మాల్వి ల వ్యవహారం హాట్ టాపిక్ గా నడుస్తున్న సంగతి తెలిసిందే. మాల్వి కారణంగా రాజ్ తరుణ్ తనను దూరం పెట్టాడని చెప్పి లావణ్య ..కొద్దీ రోజులుగా రాజ్ తరుణ్ ఫై ఆరోపణలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా నమోదు అయ్యాయి. వీరిద్దరి వ్యహారంలో కలగజేసుకున్న RJ శేఖర్ భాష..ఫై ఇప్పుడు లావణ్య కేసు పెట్టింది. తాజాగా లావణ్య ఒక టీవీ షోలో శేఖర్ బాషా అనే వ్యక్తిపై చెప్పు విసరడంతో ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఊహించని ట్విస్ట్ వచ్చి.. సీన్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది.
We’re now on WhatsApp. Click to Join.
రాజ్ తరుణ్ కు సపోర్ట్ గా శేఖర్ భాష మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ఓ టీవీ షో లో లావణ్య , శేఖర్ పాల్గొనగా..శేఖర్ మాట్లాడుతున్న వేళ..లావణ్య చెప్పుతో కొట్టడం తో సంచలనం రేపింది. దీనిపై మీడియా లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో RJ శేఖర్ బాషా నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ లావణ్య పోలీసుల్ని ఆశ్రయించారు. ‘శేఖర్ బాషా నాపై అటాక్ చేశాడు. కడుపులో, నడుము మీద తన్నాడు. 12 మెట్లపై నుంచి కిందకు పడిపోయాను. నన్ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాను. మొన్న రాత్రి మా ఇంటి కిటికీపై రాళ్లు విసిరారు. అతడి వల్ల నాకు ప్రాణహాని ఉంది. భయమేస్తోంది. నాకేం జరిగినా అతడే కారణం’ అని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. మరి దీనిపై శేఖర్ ఏమంటాడో చూడాలి.
Read Also : Shanidev: శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తున్నారా.. అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి?