Prabhas-Ranbir: అదిరిపొయే అప్డేట్, ప్రభాస్ తో రణబీర్ కపూర్ స్క్రీన్ షేర్, ఫ్యాన్స్ కు పండుగే!

ఎప్పుడైతే పాన్ ఇండియా సినిమాలు షూరు అయ్యాయో , అప్పట్నుంచే క్రేజీ కాంబినేషన్స్ తెరపై సందడి చేస్తున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Prabha And Ranbir

Prabha And Ranbir

Prabhas-Ranbir: బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ ట్రైలర్‌ ప్రతిఒక్కరినీ ఆకట్టకుంటుంది. నటుడు పూర్తిగా కొత్త అవతార్‌లో కనిపించడంతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. ట్రైలర్‌లోని రణబీర్ లుక్స్ అభిమానులను సినిమా చూడాలనే ఆసక్తిని కలిగిస్తున్నాయి. అయితే ఇటీవల ఈ హీరో నందమూరి బాలకృష్ణ “అన్‌స్టాపబుల్ విత్ NBK” షోలో సందడి చేశాడు.

ఈ కార్యక్రమంలో రణబీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ తదుపరి చిత్రంలో నటించాలని తన కోరికను వ్యక్తం చేశాడు. ‘స్పిరిట్‌’లో అతిధి పాత్రలో నటించేందుకు ఇష్టపడతానని, ప్రభాస్‌ తన స్నేహితుడని పేర్కొన్నాడు. “సందీప్ రెడ్డి వంగా తదుపరి చిత్రం ప్రభాస్ అన్నతో చేస్తున్నాడని. అతను నా కోసం చిన్న పాత్ర ఇస్తే నేను స్పిరిట్‌లో భాగం కావడానికి ఒకే”అని రణబీర్ అన్నారు. “నేను ప్రభాస్‌కి సన్నిహితుడిగా ఉండాలనుకుంటున్నాను. నేను కూడా అతనికి పెద్ద అభిమానిని అంటూ రియాక్ట్ అయ్యాడు.

సందీప్ రెడ్డి వంగా తనకు చిన్న పాత్ర చేస్తే, స్పిరిట్‌లో నటించడానికి తప్పకుండా ఇష్టపడతానని రణబీర్ కపూర్ ఈ సందర్భంగా తేల్చి చెప్పాడు.  ది స్పిరిట్ సినిమా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన రాబోయే రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఇందులో ప్రభాస్, కీర్తి సురేష్, కరీనా కపూర్ ఖాన్, కియారా అద్వానీ తదితరులు నటించారు. సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ ప్రస్తుతం ‘యానిమల్’ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ డిసెంబర్ 1న విడుదల కానుంది.

Also Read: Vanabhojanalu: వనభోజనాలు ఎందుకు చేస్తారో తెలుసా.. దాని విశిష్టత ఇదే

  Last Updated: 25 Nov 2023, 03:48 PM IST