Site icon HashtagU Telugu

Adipurush Postponed: ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్.. ఆదిపురుష్ రిలీజ్ వాయిదా!

Adipurush

Adipurush

ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా మరోసారి హాట్ టపిక్ గా మారింది. ఈ సినిమాను మొదట్లో జనవరిలో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు డిసైడ్ అయ్యారు. కానీ ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో 2023కు వాయిదా పడింది. లార్డ్ రామ్‌గా ప్రభాస్ నటించిన “ఆదిపురుష్” పాన్-ఇండియన్ సినిమాల్లో ఒకటి. అక్టోబర్ 2న యూపీలోని అయోధ్యలో టీజర్‌ను అట్టహాసంగా విడుదల చేశారు. అయితే విజువల్ ఎఫెక్ట్స్ సరిగా లేకపోవడంతో టీజర్ కు చాలా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.

వీఎఫ్‌ఎక్స్ విషయంలో రాజీ పడడం వల్ల సినిమా అంచనాలు దెబ్బతింటాయి. క్వాలిటీ విషయంలో ప్రభాస్ పట్టుదలతో ఉన్నాడు. దీంతో నిర్మాతలు, దర్శకులు దీనిపై మరింత కృషి చేయాలని భావించారు. ఈ కారణంగా 2023 వేసవికి వాయిదా వేయబడింది. “ఆదిపురుష్” సినిమా ప్రేక్షకులకు అపూర్వ అనుభూతిని అందించనుందని మేకర్స్ ఫుల్ ధీమాతో ఉన్నారు.