Site icon HashtagU Telugu

Mahesh babu: మహేష్ కు అది తలకు మించిన భారమే అని అంటున్న చిరంజీవి?

Mixcollage 06 Mar 2024 08 45 Am 1020

Mixcollage 06 Mar 2024 08 45 Am 1020

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి ఎప్పుడెప్పుడు మొదలవుతుందా ఎప్పుడు విడుదల అవుతుందా అని మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే మహేష్ ఈజ్ ట్రూ పెర్ఫార్మర్. కానీ జక్కన్న హార్డ్‌ టేకింగ్‌కు మహేష్ తట్టుకోగలరా? అనే డౌట్ ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ లోనూ ఉంది. దానికితోడు ఈ సినిమా షూటింగ్‌కే 3 సంవత్సరాలు పట్టడం అ సినిమాలో దాదాపు 8 గెటప్స్‌లో మహేష్‌ కనిపించాల్సి రావడం కూడా మహేష్‌ కు కష్టంగా మారనుంది అనే కామెంట్లు ఎక్కువగానే వినిపిస్తున్నాయి.

కానీ ఎంతైనా జక్కన్న సినిమా.. ఎప్పుడూ కంఫర్ట్‌ జోన్‌లో ఉంటే మహేష్‌కు తలకు మించిన భారమే అని అంటున్నారు కొంత మంది నెటిజన్లు. కేవలం నెటిజన్లు మాత్రమే కాకుండా చిరంజీవి కూడా ఈ సినిమా చేయడం అన్నది మహేష్ బాబుకు తలకు మించిన భారమే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలె గుంటూరు కారం మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మహేష్ బాబు అభిమానులతో పాటు అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఊహించని విధంగా ఈ మూవీ థియేటర్ లో నెగిటివ్ టాక్ ను తెచ్చుకోవడం వల్ల నిజంగా ఒక షాకింగ్ విషయం అని చెప్పవచ్చు. కాగా ఈ సినిమాలో కుర్చీ మడత పెట్టి అనే పాట ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. యూట్యూబ్లో రికార్డు స్థాయిలో వ్యూస్ నిలబట్టడంతో పాటు కలెక్షన్ల మోత మోగించింది. మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఈ పాటను వీక్షించారు.