Site icon HashtagU Telugu

Laila : లైలా మూవీ టాక్

Laila 2025 Movie Talk

Laila 2025 Movie Talk

యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) నటించిన తాజా చిత్రం ‘లైలా’ (Laila ) ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ హీరోగా పేరు దక్కించుకున్న ఈయన తొలిసారి ఇందులో లేడీ పాత్రలో నటించారు. సినిమా తాలూకా సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ ఇలా ప్రతిదీ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆసక్తిని పెంచడంతో థియేటర్స్ వద్ద సందడి నెలకొంది.

షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై యువ నిర్మాత సాహు గారపాటి నిర్మించిన ఈ మూవీ లో విశ్వక్ సేన్ సరసన ఆకాంక్ష శర్మ జోడి కాగా కామాక్షి భాస్కర్ల, వెన్నెల కిషోర్, హర్షవర్ధన్, బ్రహ్మాజీ, బబ్లూ పృథ్వీ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. ఇక సినిమాకు ఓవరాల్ గా పాజిటివ్ టాక్ నడుస్తుంది. ఫస్టాఫ్ బాగుందని , సోను క్యారెక్టర్ సహా కామెడీతో కడుపుబ్బా నవ్వుకున్నామని విశ్వక్‌ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సెకండాఫ్‌ కూడా బాగుంటుందని , కంప్లీట్‌గా విశ్వక్‌సేన్ వన్ మేన్ షో అని ట్వీట్లు చేస్తున్నారు.

Donald Trump : ప్రధాని మోదీ గ్రేట్ లీడర్ – ట్రంప్

మరికొంతమంది మాత్రం సినిమా డిజాస్టర్ అంటూ పబ్లిసిటీ చేస్తున్నారు. మరి ఇది వైసీపీ పనే అని అభిమానులు అంటున్నారు. ప్రీ రిలీజ్ వేడుకలో పృథ్వి వైసీపీ పై చేసిన వ్యాఖ్యలపై సినిమాను పై తీవ్ర ప్రభావమే పడినట్లు స్పష్టంగా తెలుస్తుంది. వైసీపీ ట్విట్టర్ అకౌంట్లు మాత్రం డిజాస్టర్ లైలా అని ఇంకా ట్రెండ్ చేస్తూనే ఉన్నాయి. వారిలో ఎంత మంది సినిమాని చూసి ఉంటారు.. ఎంత మంది టార్గెటెడ్‌గా డిజాస్టర్ లైలా అని ట్రెండ్ చేస్తున్నారు అన్నది చెప్పడం కష్టం. కానీ లైలా మీద కావాలనే నెగెటివ్ ట్రెండ్ చేస్తున్నారని మాత్రం అర్థం అవుతోంది.

మరోపక్క హీరో విశ్వక్ సేన్ సినిమాను సినిమాలాగే చూడాలని కోరుకుంటున్నారు. ఈ సినిమా గురించి చాలా మిస్ అండర్ స్టాండింగ్ జరిగింది. ఏవోవో సమస్యలు వచ్చాయి. మా తప్పు లేకపోయినా క్షమాపణలు అడిగాను. విద్వేషం ఎప్పటికీ గెలువదు. ఇండస్ట్రీకి సంబంధం లేకుండా నిలబడ్డాను. నేను గెలిస్తే మీరు గెలిచినట్టే.. మీరు ఎంకరేజ్ చేస్తే చాలా మంచి పాత్రలు చేయగలను. కడుపుబ్బ నవ్వించేందుకు ప్రయత్నించాం. కొత్త నటీనటులు, కొత్త డైరెక్టర్, అందరి లైఫ్ ఈ సినిమాపై అధారపడి ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత అపార్ధం ఎందుకు చేసుకొన్నామనే అభిప్రాయం కలుగుతుంది. థియేటర్లలో లైలాను చూసి ఎంకరేజ్ చేయండి అని విశ్వక్ సేన్ అభ్యర్థించారు.