Site icon HashtagU Telugu

Vishwak Sen’s Laila : ‘లైలా’ ఫస్ట్ డే కలెక్షన్స్..ఇంత దారుణమా..?

Lila Collections

Lila Collections

యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) నటించిన తాజా చిత్రం ‘లైలా’ (Laila ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ హీరోగా పేరు దక్కించుకున్న ఈయన తొలిసారి ఇందులో లేడీ పాత్రలో నటించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై యువ నిర్మాత సాహు గారపాటి నిర్మించిన ఈ మూవీ లో విశ్వక్ సేన్ సరసన ఆకాంక్ష శర్మ జోడి కాగా కామాక్షి భాస్కర్ల, వెన్నెల కిషోర్, హర్షవర్ధన్, బ్రహ్మాజీ, బబ్లూ పృథ్వీ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. టీజర్ , ట్రైలర్ కాస్త బాగుండడం తో సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని వెళ్లిన అభిమానులకు , ప్రేక్షకులు డైరెక్టర్ భారీ షాక్ ఇచ్చాడు. కథ లో కొత్తదనం కాదు కదా..కనీసం ఇది ఓ స్టోరీ అని కూడా చెప్పలేనంత చెత్తగా రాసుకొని ప్రేక్షకులను భయపెట్టాడు.

దీనికి మళ్లీ బోల్డ్ డైలాగ్స్ పెట్టి ఇంకా చెడ్డలం చేసాడు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అవ్వడమే కాదు నిర్మాతకు భారీ నష్టాలూ మిగిల్చాడు. ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికి వస్తే వరల్డ్ వైడ్ గా కనీసం కోటి రూపాయిలు కూడా రాని పరిస్థితి. ఇది చాలు సినిమా ఎంత డిజాస్టర్ అయ్యిందో.. విశ్వక్ సేన్ నటించిన పలు సినిమాలు పర్వాలేదు అనిపించినా..ఈ రేంజ్ చెత్త అనిపించుకున్న సినిమాలు లేవు. దాస్ క ధమ్కి, గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టాయి. కానీ లైలా మాత్రం దారుణమైన టాక్ నే కాదు కలెక్షన్స్ రాబట్టి విశ్వక్ ఖాతాలో మరో డిజాస్టర్ గా నిలిచింది.