Site icon HashtagU Telugu

Laila Censor : ‘లైలా’ కు ‘A’ సర్టిఫికెట్

Laila Movie Censor

Laila Movie Censor

యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) నటించిన తాజా చిత్రం ‘లైలా’. మాస్ హీరోగా పేరు దక్కించుకున్న ఈయన తొలిసారి ఇందులో లేడీ పాత్రలో నటించారు. ఫిబ్రవరి 14వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే సినిమా తాలూకా సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ ఇలా ప్రతిదీ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఈ క్రమంలో మేకర్స్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసారు. సినిమాను చూసిన సెన్సార్ బృందం సినిమాకు “A” సర్టిఫికెట్ జారీ చేసారు. ఈ సినిమా రన్ టైమ్ ఎండింగ్ కార్డ్స్ కలుపుకొని 2 గంటల 16 నిమిషాలు ఉన్నట్లు మూవీ వర్గాలు పేర్కొన్నాయి.

కాగా ప్రమోషన్ లో భాగంగా ఆదివారం ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తో పాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) తో పాటూ చిత్ర యంగ్ నిర్మాత సాహు గారపాటి (Sahoo garapati) గెస్ట్లుగా వచ్చారు. ఇకపోతే ఇదే ఈవెంట్లో నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ(Prithvi ) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినిమాను వివాదంలోకి నెట్టేశాయి. ఈ సినిమాలో 150 గొర్రెలు ఉండాలని.. కానీ లాస్ట్ సీన్‌లో నా బామ్మర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారని , కరెక్ట్‌గా లెక్కేస్తే 11 గొర్రెలే ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు వైసీపీని టార్గెట్ చేసినట్లుగా ఉన్నాయంటూ ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. లైలా సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్‌కు దిగారు వైసీపీ శ్రేణులు. దీంతో హీరో విశ్వక్ సేన్ రంగంలోకి దిగి, సినిమాను కష్టపడి చేసాము. దయచేసి మా చిత్రం పై నెగిటివ్ కామెంట్స్ రుద్దకండి అంటూ వేడుకున్నారు.