Proposal For Liger: విజయ్ దేవరకొండకు వింత ప్రపోజల్.. మోకాళ్ల మీద కూర్చుని మరీ!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ అంటే అమ్మాయిల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. మామూలుగానే అందరికీ ఆల్ టైం ఫేవరేట్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ.

Published By: HashtagU Telugu Desk
Vijay Devarakonda

Vijay Devarakonda

రౌడీ హీరో విజయ్ దేవరకొండ అంటే అమ్మాయిల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. మామూలుగానే అందరికీ ఆల్ టైం ఫేవరేట్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. గీతగోవిందం, డియర్ కామ్రేడ్, అర్జున్ రెడ్డి వంటి డబ్బింగ్ సినిమాలతో నార్త్ ఆడియెన్స్‌నూ కట్టిపడేశాడు. ఇక ఈ చిత్రాలతో విజయ్ దేవరకొండకు అమ్మాయిల్లో విపరీతమైన క్రేజ్‌ను పెంచేసింది. ఈ క్రమంలోనే లైగర్ మూవీకి ఈ రేంజ్ హైప్ వచ్చింది.

లైగర్ సినిమా ప్రమోషన్స్ కోసం విజయ్ దేశమంతా తిరుగుతున్నాడు. ఆగస్ట్ 25న రాబోతోన్న ఈ చిత్రం గురించి విజయ్ బాగానే కష్టపడుతున్నారు. సినిమాకు ఎంత కష్టపడ్డాడో.. ప్రమోషన్స్ కోసం అంతకు మించి కష్టపడుతున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా అన్ని మేజర్ సిటిల్లో చక్కర్లు కొడుతున్నారు. అయితే ఈ ప్రమోషన్స్‌లో భాగంగానే విజయ్ దేవరకొండకు వింత అనుభవం ఎదురైంది.

హీరోయిన్‌ అనన్యపాండేతో కలిసి విజయ్ దేవరకొండ దేశంలో పలు నగరాలు సందర్శించాడు. ఈ క్రమంలో బెంగళూరులో ఓ వీరాభిమాని రౌడీ హీరోకు రింగుతో ప్రపోజ్‌ చేసింది. మోకాలిపై కూర్చొని విజయ్‌కు ఉంగరం తొడిగి తన ప్రేమాభిమానాలను చాటుకుంది. రౌడీ హీరోను ఇలా కలిసినందుకు ఉద్వేగానికి లోనైన ఆ అమ్మాయి సంతోషంతో ఏడ్చేసింది. ప్రస్తుతం ఈ ప్రపోజల్ వైరల్ అవుతోంది.

ఇలాంటి పిచ్చి వీర అభిమానులు విజయ్ దేవరకొండకు ఉండటం సహజమే. ఎందుకంటే జాన్వీ కపూర్, సారా అలీఖాన్ వంటి హీరోయిన్లే విజయ్ దేవరకొండ కోసం పిచ్చెక్కిపోతోంటారు. ఇక సాధారణ యువతి ఆ మాత్రం ప్రపోజ్ చేస్తుండటంతో ఆశ్చర్యం ఏమీ ఉండదు.

 

  Last Updated: 22 Aug 2022, 11:37 PM IST