Nani : నాని సినిమా సినిమాకు వ్యత్యాసం చూపిస్తూ వరుస హిట్స్ సాధిస్తున్నాడు. ఇటీవల దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో హిట్స్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం నాని ప్యారడైజ్, హిట్ 3 సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. హిట్ 3 షూటింగ్ ప్రస్తుతం జమ్మూకాశ్మీర్ లో జరుగుతుంది.
అయితే నిన్న ఈ సినిమా షూటింగ్ లో విషాదం నెలకొంది. షూటింగ్ జరుగుతుండగా ఈ సినిమాకు అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న కేఆర్ కృష్ణ అనే మహిళకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆమెను దగ్గర్లోని హాస్పిటల్ కి తరలించారు. కానీ చికిత్స అందుకుంటూనే ఆ మహిళ చనిపోవడంతో హిట్ 3 సినిమా యూనిట్ లో విషాదం నెలకొంది.
Also Read : Ram Charan : సంక్రాంతి బరిలో తప్పుకున్న స్టార్ హీరో.. చరణ్ కి బాగా కలిసొస్తుంది..