Site icon HashtagU Telugu

Tollywood : ఫస్ట్ టైం తెలుగులో భారీ చిత్రం చేయబోతున్న అగ్ర సంస్థ..! హీరో ఎవరో తెలుసా..?

Kvn Chiru

Kvn Chiru

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) లేటెస్ట్ ప్రాజెక్ట్‌లు ఒక్కొక్కటిగా హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ కెవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) చిరంజీవితో కలిసి భారీ బడ్జెట్‌తో ఓ సినిమాకు సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం. ఈ సంస్థ ఇప్పటికే కన్నడ చిత్ర పరిశ్రమలో యశ్‌తో “టాక్సిక్” అనే సినిమాను నిర్మిస్తోంది. ఇక తెలుగు ఇండస్ట్రీలో మొదటిసారిగా స్వయంగా నిర్మాణానికి దిగుతోందంటే అంచనాలు ఏవిధంగా ఉంటాయో చెప్పక్కర్లేదు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘చిరు – ఓదెల’, అనిల్ రావిపూడి మూవీస్ పూర్తి అయిన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

Samsung : సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10ఎఫ్ఈ సిరీస్‌ విడుదల

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి దర్శకుడిని ఇంకా ఖరారు చేయలేదు. కానీ అగ్రశ్రేణి దర్శకులతో చర్చలు జరుగుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ. చిరంజీవి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ, తన ఇమేజ్‌కు సరిపోయేలా కొత్తదనంతో కూడిన డైరెక్టర్ కోసం పరిశీలనలు జరుగుతున్నాయి. యువ దర్శకుడికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిరు ‘విశ్వంభర’ అనే సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నారు.

కెవీఎన్ ప్రొడక్షన్స్ రూపొందించనున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. అద్భుతమైన సాంకేతిక విలువలు, విస్తృతమైన కథాంశం ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపేలా ఉంటుందని సమాచారం. కథ, నటీనటులు, దర్శకుడిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇదే సమయంలో బాబీ వంటి దర్శకులు కూడా చిరు కోసం కథలు రెడీ చేస్తుండటంతో.. మెగాస్టార్ అభిమానులకు సరికొత్త విజయాల పండుగ రానుందని చెప్పవచ్చు.