Site icon HashtagU Telugu

Kushi Trailer: ఖుషి ట్రైలర్ రిలీజ్, విజయ్, సమంత కెమిస్ట్రీ అదుర్స్!

Kushi

Kushi

శివ నిర్వాణ అనగానే మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ కళ్ల ముందు కదలాడుతాయి. ఆయన నుంచి వచ్చిన మజిలీ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరి  కలయికలో రాబోతున్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ‘ఖుషి’. త్వరలో విడుదలకు  సిద్దమవుతుంది. గత కొంతకాలంగా ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీ నుంచి ఒక్కొక సాంగ్ రిలీజ్ చేస్తూ వచ్చారు. తాజాగా ఇప్పుడు మూవీ ట్రైలర్ ని కూడా ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.

ఇప్పటి జనరేషన్ వాళ్ళు పెళ్లి చేసుకున్న తరువాత వారి మధ్య వచ్చే చిన్న చిన్న సమస్యలను ఈ సినిమాలోని కథగా చూపించబోతున్నారని తెలుస్తుంది. ఆ మూవీలోని కామెడీ, ఎమోషన్స్. లవ్ ఈ సినిమాలో కూడా కనిపించబోతున్నాయని అర్ధమవుతోంది. దీనమ్మ కశ్మీర్.. సేమ్ రోజా సినిమాలాగే ఉంది” అని విప్లవ్ (విజయ్ దేవరకొండ) చెప్పే డైలాగ్‍లో ఖుషి మూవీ ట్రైలర్ మొదలైంది. ముందుగా కశ్మీర్‌లో ముస్లింగా ఆరాధ్య (సమంత) పరిచయం అవుతుంది. ఆమెను విప్లవ్ ప్రేమిస్తాడు.

ఆమె కూడా ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత “నేను బేగం కాదు.. బ్రాహ్మిణ్” అని విప్లవ్‍కు చెబుతుంది ఆరాధ్య. ఆ తర్వాత విప్లవ్, ఆరాధ్య (సమంత) లవ్ చేసుకోవడం, కుటుంబాలు ఒప్పుకోకపోవడం, వారిద్దరూ బయటికి పెళ్లి చేసుకోవడం, వారి మధ్య గొడవలు జరగడం, ఎమోషన్ సీన్లు ట్రైలర్‌లో ఉన్నాయి. ప్రేక్షకుల్లో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ఖుషి మూవీ ట్రైలర్ వచ్చింది. ఈ సినిమా సెప్టెంబర్ 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.

Also Read: Bank Manager Fraud: బ్యాంక్ మేనేజర్ చేతివాటం, కస్టమర్స్ ఖాతాల నుంచి కోటి రూపాయలు మాయం