Site icon HashtagU Telugu

Kushi : ఖుషి మూవీ టాక్..అబ్బాయిలు హిట్ కొట్టేసాం

Kushi Public Talk

Kushi Public Talk

యూత్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) – సమంత (Samantha ) జంటగా మజిలీ ఫేమ్ శివ నిర్వాణ (‎Shiva Nirvana) డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ ఖుషి (Kushi). మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించిన ఈ మూవీ లో జయరాం, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రలు పోషించారు. ఈరోజు ( సెప్టెంబర్ 1వ తేదీన ) తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషలలో గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమాలోని సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలువడం… ఒకదానిని మించి మరోటి హిట్ అవ్వడం.. పాటలతోనే కాకుండా చిత్ర ట్రైలర్ , టీజర్ , స్టిల్స్ , ప్రమోషన్ కార్యక్రమాలు ఇలా ప్రతిదీ సినిమా ఫై ఆసక్తి నింపడం తో సినిమాను చూసేందుకు అభిమానులు , సినీ లవర్స్ పోటీ పడుతున్నారు.

Read Also : IT Notice : చంద్రబాబు కు ఐటీ నోటీసులు..?

అమెరికా (USA) లో అర్ధరాత్రి నుండే షో పడడంతో సినిమా చూసిన ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా సినిమా సూపర్ హిట్ అని , మళ్లీ విజయ్ ఫామ్ లోకి వచ్చినట్లే అని చెపుతున్నారు. విజయ్ – సామ్ (Vijay – Sam) కెమిస్ట్రీ సినిమాకు హైలైట్ గా నిలిచిందని , సాంగ్స్ ఓ లెవల్లో ఉన్నాయని అంటున్నారు. ప్రేమ సన్నివేశాలతో పాటు కామెడీ కూడా అదిరిపోయిందని చెపుతున్నారు. చివరి 30 నిముషాలు డైరెక్టర్ (Shiva Nirvana) కన్నీరు పెట్టించారని అంటున్నారు. ఓవరాల్ గా అబ్బాయిలు హిట్ కొట్టం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించిందని , సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా కాస్త నెమ్మదిగా సాగిందని అంటున్నారు. బ్రహ్మానందం (Brahmanandam) మీద చివరి షాట్ అదిరిపోయింది.. అందరూ ఓ సారి చూడదగ్గ చిత్రమిది అని చెపుతున్నారు.