‘మహానటి’ సినిమాలో కలిసి కనిపించిన సమంత (Samantha), విజయ్ దేవరకొండ జోడీ ఇప్పుడు పూర్తిస్థాయిలో హీరో .. హీరోయిన్స్ గా ఖుషి (Kushi) సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. ప్రేమకథా చిత్రాల స్పెషలిస్టుగా శివ నిర్వాణ ఈ మూవీకి డైరెక్టర్ గా వ్యవహరిస్తుండట, లైగర్ (Liger) తర్వాత విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) నటిస్తుండటం, మజిలీ లాంటి లవ్ స్టోరీ తర్వాత సమంత హీరోయిన్ నటిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కొంత సేపటి క్రితం, ‘నా నువ్వే’ అనే ఫస్టు సింగిల్ (First Single) ను రిలీజ్ చేశారు.
శివ తెరకెక్కించిన ‘నిన్నుకోరి’ ‘మజిలీ’ (Majili) సినిమాలను ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు. ఆయన దర్శకత్వంలో ఖుషి సినిమా రూపంలో మరో ప్రేమకథ ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి పాటకు హేషం అబ్దుల్ వాహెబ్ స్వరపరిచిన ఈ పాటకు సాహిత్యాన్ని అందించగా, ఆలపించారు. విజయ్, సమంత ప్రేమికులుగా నటించి మంచి కెమిస్ట్రీని పండించారు. ఈ మూవీలో సమంత ముస్లిం యువతిగా నటించబోతున్నట్టు ఈ పాట ద్వారా తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో, సెప్టెంబర్ 1వ తేదీన విడుదల చేయనున్నారు. యూత్ లో మంచి ఫాలోయింగ్ విజయ్ దేవరకొండ, సమంత నటిస్తుండటంతో ఖుషి మూవీకి మంచి బజ్ (Hype) వస్తోంది.
Also Read: Telangana Bonalu: బోనాల పండుగకు వేళాయే..!