Kushi Box Office: ఖుషికి భారీ ఓపెన్సింగ్స్, మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే!

ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, ఖుషీకి నైజాం, ఉత్తరాంధ్ర తదితర ఏరియాల్లో అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి.

Published By: HashtagU Telugu Desk
Kushi

Kushi

లైగర్ ఫెయిల్యూర్ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఖుషి సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ఇటీవల విడుదలైన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఖుషి యువ హీరో కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్‌ను నమోదు చేసింది. శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత నటించిన ఈ సినిమా ఫ్యాన్స్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. తాజా అప్‌డేట్‌ల ప్రకారం.. ఖుషి మొదటి రోజున రూ. 30.10 కోట్లు వసూలు చేసింది. USAలో, ఈ చిత్రం ప్రీమియర్లు, 1వ రోజు కలెక్షన్లతో కలిపి ఇప్పటివరకు $800K వసూలు చేసింది. పాజిటివ్ టాక్ రావడంతో ఈ మూవీకి థియేటర్లు కూడా పెరుగుతున్నాయి.

ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, ఖుషీకి నైజాం, ఉత్తరాంధ్ర తదితర ఏరియాల్లో అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ చిత్రం నైజాంలో రూ.5.15 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా, ఉత్తరాంధ్ర ప్రాంతంలో మరో రూ.1.13 కోట్ల షేర్ వసూలు చేసింది. ఓవరాల్‌గా కుషి చిత్రం తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.10 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచిన సాంగ్స్ ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి.

Also Read: TSRTC employees: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు మరో డీఏ, సెప్టెంబర్ తో కలిపి చెల్లింపు

  Last Updated: 02 Sep 2023, 06:03 PM IST