Kushi Day3 Collections: ఖుషి 3 రోజుల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించిన ఖుషి చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఈ చిత్రం కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేశారు

Published By: HashtagU Telugu Desk
Kushi Day3 Collections

New Web Story Copy 2023 09 04t142809.993

Kushi Day3 Collections: సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించిన ఖుషి చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఈ చిత్రం కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేశారు. పవన్ కళ్యాణ్ సినిమా పేరు కావడంతో ఈ చిత్రాన్ని చూసేందుకు పవర్ స్టార్ అభిమానులు సైతం ఆసక్తి చూపించారు. సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించిన చిత్రం ఖుషీ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వచ్చినారు. సచిన్ గేతేకర్, రాహుల్ రామకృష్ణ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. మలయాళ సంగీత స్వరకర్త హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఖుషి చిత్రం తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.30.1 కోట్లు వసూలు చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. ఖుషి ఒక్క ఇండియాలోనే మొదటి రోజు 15.25 కోట్లు వసూలు చేసింది. తొలి రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.51 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం ఇప్పుడు మూడో రోజుతో కలిపి మొత్తం రూ.70.23 కోట్లు వసూలు చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Also Read: Paleru Politics: షర్మిల ఏమైనా పాలేరులో పుట్టిందా.. ఎవరామె అసలు ?

  Last Updated: 04 Sep 2023, 02:28 PM IST