Na Roja Nuvve : 100 మిలియన్ల వ్యూస్ వైపు పరుగులు పెడుతున్నవిజయ్ ‘నా రోజా నువ్వే’

విజయ్ దేవరకొండ - సమంత జంటగా మజిలీ ఫేమ్ శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ఖుషి.

Published By: HashtagU Telugu Desk
Na Roja Nuvve 75 million views

Na Roja Nuvve 75 million views

విజయ్ దేవరకొండసమంత జంటగా మజిలీ ఫేమ్ శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ఖుషి (Kushi). ఈ సినిమాలోని ‘ఆరా సే ప్యారు.. అందం తన ఊరు.. సారె హుషారు బేగం బేజారు… నా రోజా నువ్వే .. నా దిల్ సే నువ్వే తననననా.. నా అంజలి నువ్వే.. గీతాంజలి నువ్వే..’ సాగే సాంగ్ యూట్యూబ్ లో 100 మిలియన్ల వ్యూస్ వైపు పరుగులు పెడుతుంది. ప్రస్తుతం 75 మిలియన్ల వ్యూస్ రాబట్టింది.

ఈ సాంగ్  (Na Roja Nuvve)విడుదలై రెండు నెలలు కావొస్తున్నా ఇంకా ట్రేండింగ్ లో కొనసాగుతుంది. ముఖ్యంగా యూత్ అయితే ఈ సాంగ్ ను ప్రతి రోజు కనీసం మూడుసార్లైనా వింటూ వస్తున్నారు. ఈ సాంగ్ ను కలర్ ట్యూన్ గా ,రింగ్ ట్యూన్ గా పెట్టుకుంటూ వస్తున్నారు. మూవీ లో సమంత అందానికి ఫిదా అయినా విజయ్ దేవరకొండ ఈ పాట పాడుతుంటే.. రియల్ లైఫ్ లో యూత్ తమ లవర్స్ ను ఊహించుకుంటూ వస్తున్నారు. దీంతో యూట్యూబ్ లో ఈ సాంగ్ సంచలన వ్యూస్ రాబడుతూ దూసుకుపోతుంది. ఈ పాట లిరిక్స్ మొత్తం లెజెండరీ డైరెక్టర్‌ మణిరత్నం (Maniratnam) సినిమాల పేర్లు కలిసి వచ్చేలా రాయడం విశేషం.

ఇప్పటివరకు ఈ సాంగ్ 75 మిలియన్ల వ్యూస్ రాబట్టింది. కేవలం ఈ సాంగ్ మాత్రమే కాదు సినిమాలో రెండో సాంగ్ నా ఆరాధ్య నువ్వే అంటూ సాగే సాంగ్ కూడా శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పుడు ఖుషి అంటూ సాగే టైటిల్ సాంగ్ ను రేపు (జులై 28) రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు సాంగ్ ప్రోమో ను విడుదల చేసారు. ఈ సాంగ్ ప్రోమో వింటుంటే ఇది కూడా మెలోడీ గా సాగనుందని అర్ధం అవుతుంది. ఓవరాల్ గా మూవీ లోని సాంగ్స్ ఫై మేకర్స్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అర్ధం అవుతుంది.

https://youtu.be/NU7xtlIeyFA

Read Also : తమిళ ఇండస్ట్రీ ఫై పవన్ చేసిన వ్యాఖ్యలకు నాజర్ క్లారిటీ

  Last Updated: 27 Jul 2023, 08:29 PM IST