Site icon HashtagU Telugu

Vishwambhara : ‘విశ్వంభర’ లో మరో నటి..?

Kushboo In Vishwambhara

Kushboo In Vishwambhara

చిరంజీవి (Chiranjeevi) హీరోగా మల్లిడి వశిష్ఠ (Mallidi Vassishta) కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిరు 156 మూవీ ‘విశ్వంభర’ (Vishwambhara). సోషియో ఫాంటసీ మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10 న రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తున్న ఈ మూవీ తాలూకా ఓ అప్డేట్ ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో త్రిష తో పాటు మరో సీనియర్ హీరోయిన్ నటించబోతున్నట్లు చెపుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

సినిమా సెకండ్ హాఫ్ లో కనిపించే ఓ కీలక పాత్ర కోసం సీనియర్ నటిని ఎంచుకోవాలి డైరెక్టర్ భావించారట. సినిమాకే హైలైట్​గా నిలవనున్న ఈ పాత్ర కోసం వశిష్ట ముందుగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విజయశాంతిని సంప్రదించారట. కానీ ఆమె పెద్దగా ఇంట్రస్ట్ చూపించకపోయేసరికి , అదే పాత్ర కోసం మరో సీనియర్ నటి ఖుష్బూని సంపద్రించగా కథ బాగా నచ్చడం వల్ల ఆమె దానికి ఓకే చెప్పేశారనీ తెలుస్తోంది. త్వరలోనే ఈమె సెట్స్ లో జాయిన్ కాబోతున్నట్లు వినికిడి. అలాగే ఈ మూవీ లో ‘హిట్లర్’ సినిమాలో లాగా చిరంజీవికి ముగ్గురు చెల్లెల్లు ఉంటారని, వారి చుట్టూ తిరిగే కథే ఇదని సినీ వర్గాలు అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ మూవీ ని ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్​పై దాదాపు రూ.200కోట్ల భారీ బడ్జెట్​తో ఈ చిత్రం రూపొందుతోంది. ఎమ్ఎమ్ కీరవాణి సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Read Also ; JP Nadda : వారికోసం కేంద్రంలో ‘బలహీనమైన ప్రభుత్వాన్ని’ మమతా బెనర్జీ కోరుకుంటున్నారు