Site icon HashtagU Telugu

Kumari Aunty : బిగ్ బాస్ హౌస్ కి కుమారి ఆంటీ.. కామన్ మ్యాన్ కేటగిరిలో ఆమెను తీసుకుంటారా..?

Sundeep Kishan Kumari

Sundeep Kishan Kumari

Kumari Aunty సోషల్ మీడియాలో కాస్త పాపులర్ అయితే చాలు వారి ఫస్ట్ గోల్ బిగ్ బాస్ కి వెళ్లడమే. బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ ని సెలబ్రిటీ తో పాటుగా ఒక కామన్ మ్యాన్ కేటగిరి కూడా ఉంటుంది. అందులో ఎవరిని ఎలాగైనా తీసుకునే అవకాశం ఉంది. జనాలకు తెలిసిన వారిని తీసుకోవచ్చు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వారిని కూడా తీసుకోవచ్చు. బిగ్ బాస్ రివ్యూస్ రాసుకుంటూ బిగ్ బాస్ హౌస్ మెట్ గా వెళ్లాడు ఆది రెడ్డి.

ఇక సీజన్ 7 లో కామన్ మెన్ కేటగిరిలో వచ్చిన పల్లవి ప్రశాంతే సీజన్ విన్నర్ గా మారిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అదే కామన్ మ్యాన్ కేటగిరి కింద కుమారి ఆంటీని తీసుకోవాలని చూస్తున్నారట బిగ్ బాస్ టీం. హైదరాబాద్ లో ఉన్న వారికి ఆ ఫుడ్ స్టాల్ గురించి పరిచయం అవసరం లేదు. గత 3, 4 రోజులుగా ఆమె పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఆమె గురించి మాట్లాడాడు అంటే ఆమె ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా ఆమె కర్రీస్ తిన్నారని టాక్. అందులో ఎన్.టి.ఆర్ కూడా ఉన్నాడని అంటున్నారు. సో అలాంటి కుమారి ఆంటీ బిగ్ బాస్ కి వెళ్తే ఎంతోకొంత షోకి యాడ్ అవుతుందని ఆలోచిస్తున్నారు. బిగ్ బాస్ కి కుమారి ఆంటి వస్తే మాత్రం ఆమె సోషల్ మీడియా ఫాలోవర్స్ అంతా కూడా ఆమెకే ఓటు వేసే అవకాశం ఉంది.

Exit mobile version