AP Politics : గుడివాడలో కుమారి ఆంటీ ప్రచారం.. పిఠాపురంలో నిర్మాత ఎస్‌కెఎన్..

రీసెంట్ సోషల్ మీడియా సెన్సేషన్ కుమారి ఆంటీ కూడా ప్రచారంలోకి ఎంట్రీ ఇచ్చేసారు. కుమారి ఆంటీ స్వస్థలం గుడివాడ అని అందరికి తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
Kumari Aunty Producer Skn In Tdp Janasena Campaign

Kumari Aunty Producer Skn In Tdp Janasena Campaign

AP Politics : ఈసారి ఏపీ ఎన్నికల్లో సెలబ్రిటీస్ సందడి కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీకి మద్దతు తెలుపుతూ టాలీవుడ్ సెలబ్రిటీస్ టు సోషల్ మీడియా స్టార్స్ ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే రీసెంట్ సోషల్ మీడియా సెన్సేషన్ కుమారి ఆంటీ కూడా ప్రచారంలోకి ఎంట్రీ ఇచ్చేసారు. కుమారి ఆంటీ స్వస్థలం గుడివాడ అని అందరికి తెలిసిందే.

గుడివాడలో వైసీపీ తరుపు నుంచి కోడలి నాని పోటీ చేస్తుంటే, టీడీపీ తరుపు నుంచి వెనిగండ్ల రాము భారీలో ఉన్నారు. ఈ టీడీపీ అభ్యర్థిని సపోర్ట్ చేస్తూ కుమారి ఆంటీ గుడివాడలో ప్రచారం చేస్తున్నారు. 15ఏళ్ల క్రితం గుడివాడ ఎలా ఉందో, ఇప్పటికి అలాగే ఉందని, ఎటువంటి అభివృద్ధి జరగలేదని కుమారి ఆంటీ పేర్కొన్నారు. వైద్యం విషయంలో కూడా ఏ అభివృద్ధి లేదని, అందువల్లే తాను తన తండ్రిని పోగొట్టుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.

కాబట్టి అభివృద్ధి చేసే వ్యక్తిని ప్రజలు ఎన్నుకోవాలని చెప్పుకొచ్చిన కుమారి ఆంటీ.. వెనిగండ్ల రాము అలంటి వ్యక్తే అని పేర్కొన్నారు. మహర్షి సినిమాలో మహేష్ బాబు విదేశాలు నుంచి వచ్చి మంచి పనులు చేసారు. అయితే అది సినిమా, రియల్ లైఫ్ లోకి వస్తే.. వెనిగండ్ల రాము అలా మంచి చేయాలనే ఆలోచనతో విదేశాలు నుంచి వచ్చారని, గుడివాడలో ఆయన గెలిస్తే కచ్చితంగా జరుగుతుందని తాను భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

ఇక పిఠాపురంలో ప్రముఖ నిర్మాత ఎస్‌కెఎన్ పవన్ కోసం ప్రచారం చేస్తున్నారు. పవన్ సినిమాలకు పిఆర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పని చేసిన ఎస్‌కెఎన్.. పవన్ స్థాపించిన ‘కామన్ మాన్ ప్రొటెక్షన్ ఫోర్స్’లో కూడా పని చేసారు. ప్రజలకు మంచి చేయాలనే పవన్ ఆలోచన తనని ఎప్పుడు స్ఫూర్తి పొందేలా చేస్తుందని, ఆ స్ఫూర్తితోనే నేడు పిఠాపురం విధుల్లో ఆయన కోసం ప్రచారం చేస్తున్నాని, దీనివల్ల చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

  Last Updated: 10 May 2024, 08:01 AM IST