శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా (Dhanush , Nagarjuna , Rashmika) ప్రధాన పాత్రల్లో నటించిన ‘కుబేర’ (Kuberaa) చిత్రం జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇప్పటికే భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం, సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని U/A సర్టిఫికెట్ పొందింది. తాజా సమాచారం ప్రకారం.. సినిమా 3 గంటల 1 నిమిషం నిడివిని ఫిక్స్ చేసారు. ఇది ఈ మధ్యకాలంలో చాలా అరుదైన విషయం. అయితే సినిమాలో ఎమోషనల్ కంటెంట్ బలంగా ఉండటంతో రన్ టైమ్ పెద్ద సమస్య కాదని సెన్సార్ సభ్యులు అభిప్రాయపడ్డారు.
Lokesh : బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్ భేటీ..నైపుణ్యాభివృద్ధిపై కీలక చర్చలు
ఇక సినిమా కథ విషయానికి వస్తే…సినిమాలో బిచ్చగాడిగా ధనుష్ నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని, ఈ సినిమా విడుదలైన తర్వాత ఆయన పెర్ఫార్మెన్స్ గురించి అందరూ మాట్లాడుకోనున్నారు అని చెబుతున్నారు. శేఖర్ కమ్ముల ధనుష్ పాత్రను తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందని అంటున్నారు. నాగార్జున ధనుష్‌కు పోటీపడే స్థాయిలో నటించి, సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని, రష్మిక ఈ సినిమాతో తన కెరీర్‌లో మరో మైలురాయిని చేరినట్టే అని పేర్కొన్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఇలా అన్ని కూడా హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయని టాక్.
ఈ చిత్రంలో బిచ్చగాడు, కోటీశ్వరుడు, మధ్యతరగతి వ్యక్తి, జీవితంపై ఆశ కోల్పోయిన అమ్మాయి వంటి పాత్రల మధ్య జరిగే భావోద్వేగ కథే ప్రధానాంశమట. సెకండాఫ్‌లో కొన్ని ల్యాగ్స్ ఉన్నప్పటికీ, చివరి 15 నిమిషాల్లో వచ్చే క్లైమాక్స్ డ్రామా అన్ని లోపాలను మరిచిపోయేలా చేస్తుందని సెన్సార్ రిపోర్ట్ పేర్కొంది. ఈ క్రేజీ కాంబినేషన్, బలమైన కథ, అద్భుతమైన నటన ఇలా అన్ని కూడా ‘కుబేర’ సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చిత్రబృందం ధీమాగా ఉన్నది.