హ్యాపీ డేస్ ఫేమ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘కుబేర'(Kubera). ధనుష్ , రష్మిక (Dhanush-Rashmika) జంటగా నటిస్తున్న ఈ మూవీ లో కింగ్ అక్కినేని నాగార్జున (Nagarjuna) కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ జిమ్ సర్బ్ కూడా ఓ కీ రోల్ లో కనిపించనున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న
ఈ చిత్రాన్ని 2025 జూన్ 20న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
Shiva: పరమేశ్వరుడికి పూజ చేస్తున్నారా.. అయితే పొరపాటున కూడా తప్పులు అస్సలు చేయకండి!
ఈ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో నాగార్జున, ధనుష్ ఎదురెదురుగా నిలబడి ఒకరినొకరు ఇంటెన్స్ గా చూసుకుంటున్నారు. మధ్యలో జిమ్ సెర్బ్ ని కూడా ప్రెజెంట్ చేసారు. బ్యాగ్రౌండ్ లో ఓ మహా నగరాన్ని సర్కిల్ ను చూపించారు. వాస్తవానికి ముందుగా ఈ సినిమాని మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేస్తారని, ఆ తర్వాత ఉగాదికి తీసుకొస్తారని ప్రచారం జరిగినప్పటికీ..ఇక ఇప్పుడు ఏకంగా జూన్ లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు.
Chandra Shekhar Azad: తెల్లదొరలపై రివేంజ్ తీర్చుకున్న చంద్రశేఖర్ ఆజాద్.. జీవిత విశేషాలివీ
‘లవ్ స్టోరీ’ తర్వాత శేఖర్ కమ్ముల మూడున్నరేళ్ల గ్యాప్ తీసుకొని చేస్తున్న ‘కుబేర’ చిత్రంతో రాబోతున్నాడు. ఈ మూవీ లో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్స్ ధనుష్, నాగ్ నటిస్తుండటంతో అందరిలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అంతే కాకుండా పుష్ప తో వరల్డ్ వైడ్ గా ఫుల్ ఫేమస్ అయినా దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తుండడం సినిమాకు మరో ప్లస్ గా మారింది. మరి ఎన్ని ప్లస్ లు ఉన్నాయి కాబట్టి సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుందని అంత భావిస్తున్నారు. చూద్దాం ఏంజరుగుతుందో..!!