ధనుష్, శేఖర్ కమ్ముల (Dhanush – Shekhar Kammula) కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ సినిమా ‘కుబేర’ (Kuberaa ) ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఈ మూవీ విడుదల వాయిదా పడనుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ప్రచారాల్లో ఏ మాత్రం నిజం లేదని మూవీ యూనిట్ స్పష్టంచేసింది. ముందుగా ప్రకటించిన ప్రకారం జూన్ 20వ తేదీనే సినిమాను విడుదల చేయనున్నట్లు తేల్చిచెప్పింది.
Waqf Act : వక్ఫ్ చట్టాన్ని నిలిపివేయలేం : కేంద్రం
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియో మరియు ఫస్ట్ సింగిల్ సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. శేఖర్ కమ్ముల టేకింగ్ ఓ ఎత్తు అయితే, ధనుష్ యాక్షన్-ఎమోషనల్ షేడ్స్‌తో కూడిన పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాకు సంగీతం అనేక భాషల్లో ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. అంతేకాదు సినిమాకు సంబంధించిన టీజర్‌ను కూడా త్వరలోనే రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.
ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా, అక్కినేని నాగార్జున కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. విలక్షణ కథాంశంతో, బహుభాషా ప్రేక్షకులను ఆకట్టుకునే లక్ష్యంతో ఈ సినిమా రూపొందుతోంది. భారీ కాస్టింగ్, టెక్నికల్ వాల్యూస్, దర్శకుడి ప్రత్యేక శైలి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేస్తున్నాయి. జూన్ 20న థియేటర్లలోకి వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో ఎంతో ఉత్కంఠ నెలకొంది.