ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘కుబేర’ (Kubera) చిత్రం ఇప్పటికే మంచి అంచనాలను సృష్టించుకుంది. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ప్రధాన పాత్రలో నటిస్తుండగా, టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna) కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాట **‘పోయిరా మామా’**ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాటకు సాహిత్యం ప్రముఖ రచయిత భాస్కర భట్ల రాయగా, ఆసక్తికరమైన విషయమేంటంటే.. ఈ పాటను ధనుష్ స్వయంగా తెలుగులో పాడడం విశేషం.
Jammu Kashmir Cloud Burst : జమ్మూకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్..అసలు క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి..?
సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటకు పాపులర్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ స్టెప్పులు సమకూర్చారు. పాటలో ధనుష్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు జిమ్ సార్భ్ మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. వినోదం, భావోద్వేగాలు, మాస్ కమర్షియల్ హంగులు కలగలసిన ఈ చిత్రం సంగీతం, కథల పరంగా భిన్నంగా ఉండబోతుందని చిత్రయూనిట్ చెబుతోంది.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP మరియు అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల సంయుక్త నిర్మాణంలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘కుబేర’ చిత్రం 2025 జూన్ 20న పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.