Site icon HashtagU Telugu

Kingdom : కింగ్డమ్ చిత్రానికి కేటీఆర్ తనయుడు గూస్‌ బంప్స్ రివ్యూ.. విజయ్ దేవరకొండ రిప్లై

Himansh

Himansh

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)నటించిన తాజా చిత్రం “కింగ్డమ్” (Kingdom ) ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. జూలై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కింది. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ చిత్రంలో భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటించగా, సత్యదేవ్ కీలక పాత్రలో మెరిశారు. విజయ్ దేవరకొండ నటన, యాక్షన్ సీక్వెన్స్‌లు, అనిరుధ్ రవిచందర్ సంగీతం, మరియు సినిమా బ్యాక్‌డ్రాప్ బాగున్నాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో చాలా ఏళ్ల తర్వాత విజయ్ దేవరకొండకు మంచి హిట్ లభించిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాను తాజాగా కేటీఆర్ కుమారుడు హిమాన్షు చూసి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్‌లో ఇద్దరు స్నేహితులతో కలిసి “కింగ్డమ్” సినిమాను చూసినట్లు హిమాన్షు తెలిపారు. సినిమా చూసిన తర్వాత తన అనుభవాన్ని ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ, “మొదటిసారి థియేటర్‌లో సినిమా చూడటం ఉత్సాహభరితంగా అనిపించింది. థియేటర్‌లోని బిగ్ స్క్రీన్, ఆడియన్స్ మధ్య ‘కింగ్డమ్’ వైబ్ గూస్‌బంప్స్ తెప్పించాయి” అని పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ నటనను హిమాన్షు ప్రశంసించారు. హిమాన్షు ఇచ్చిన ఈ పాజిటివ్ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Content Creators : కంటెంట్ క్రియేటర్లకు బిగ్ షాక్ ఇవ్వబోతున్న గూగుల్?

హిమాన్షు ట్వీట్‌కు విజయ్ దేవరకొండ హార్ట్ ఎమోజీతో రిప్లై ఇచ్చారు. ఈ ఇద్దరు ప్రముఖుల అభిమానులు దీనిపై ఆనందం వ్యక్తం చేస్తూ, వారి ట్వీట్‌లను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. కేటీఆర్ తనయుడి రివ్యూ, దానికి విజయ్ దేవరకొండ స్పందన అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి.

ఇదిలా ఉండగా, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా కూడా “కింగ్డమ్” చిత్రంపై కీలక పోస్ట్ చేశారు. ఎక్స్ వేదికగా రష్మిక చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “నాకు తెలుసు.. ఈ సినిమా నీకు.. నిన్ను ప్రేమించేవారికి ఎంత ముఖ్యమైనదో అని. ఒక మంచి హిట్ కోసం ఎంతగా ఎదురుచూశావు, నిన్ను అభిమానించేవారికి కూడా తెలుసు. మనం కొట్టినమ్​” అంటూ రష్మిక విజయ్ దేవరకొండకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ట్వీట్‌కు విజయ్ దేవరకొండ, “మనం కొట్టినమ్” అంటూ ఓ హార్ట్ సింబల్ యాడ్ చేసి రిప్లై ఇచ్చారు. దీంతో విజయ్ దేవరకొండ, రష్మిక అభిమానులు కూడా ఆనందోత్సాహాలతో ఈ ట్వీట్‌లను వైరల్ చేస్తున్నారు. “కింగ్డమ్” సినిమా విజయం సాధించడంతో విజయ్ దేవరకొండ కెరీర్‌లో తిరిగి పుంజుకుంటున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.