Site icon HashtagU Telugu

69th Sobha Filmfare Awards South 2024 : ఇది కష్టానికి దక్కిన ఫలితం – కేటీఆర్ ‘బలగం’ ట్వీట్

Ktr Balagam

Ktr Balagam

69వ ఫిల్మ్ ఫెయిర్ అవార్డ్స్ సౌత్ వేడుక (69th Sobha Filmfare Awards South 2024) నిన్న శనివారం రాత్రి హైదరాబాద్ (HYderabad) లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ అవార్డ్స్ వేడుకలో బలగం చిత్రానికి అవార్డుల పంట పండింది. ఉత్తమ చిత్రంగా బలగం (Balagam), ఉత్తమ దర్శకుడిగా వేణు యెల్దండి (Venu Yeldandi) లకు అవార్డ్స్ దక్కగా.. ‘దసరా’ సినిమాకు గానూ ఉత్తమ నటీనటులుగా నాని, కీర్తిసురేష్ లు అవార్డులు అందుకున్నారు. ఈ వేడుకకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు హాజరై సందడి చేసారు. అలాగే పలువురు నటీమణులు తమ డాన్సులతో జోష్ నింపగా.. సందీప్‌ కిషన్‌, ఫరియా అబ్దుల్లా, వింద్య విశాఖ యాంకర్లుగా ఆకట్టుకున్నారు. ఈ వేడుకలో రాశీఖన్నా, అపర్ణ బాలమురళీ, సానియా ఇయాపాన్‌, గాయత్రీ భరద్వాజ్‌ తదితరుల డాన్సులు అలరించాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఇక బలగం చిత్రానికి ఫిలిం ఫేర్ అవార్డ్స్ రావడం పట్ల మాజీ మంత్రి , సిరిసిల్ల బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) హర్షం వ్యక్తం చేశారు. బలగం చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన వేణు బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ అందుకున్నందుకు అభినందనలు తెలియజేశారు. ఇది వేణుతో పాటు అతడి టీమ్ కష్టానికి దక్కిన ఫలితమని కొనియాడారు. భవిష్యత్లో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు.

69 శోభ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌ 2024 తెలుగు విజేతలు చూస్తే..

ఉత్తమ చిత్రం: బలగం
ఉత్తమ నటుడు: నాని (దసరా)
ఉత్తమ నటి: కీర్తి సురేష్‌ (దసరా)
ఉత్తమ దర్శకుడు: వేణు యెల్దండి (బలగం)
ఉత్తమ పరిచయ దర్శకుడు: శ్రీకాంత్‌ ఓదెల (దసరా), శౌర్యువ్‌ (హాయ్‌నాన్న)
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌): సాయి రాజేష్‌ (బేబీ)
ఉత్తమ నటి (క్రిటిక్స్‌): వైష్ణవి చైతన్య (బేబీ)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): నవీన్‌ పొలిశెట్టి (మిస్‌ శెట్టి, మిస్టర్‌ పొలిశెట్టి), ప్రకాశ్‌రాజ్‌ (రంగమార్తాండ)
ఉత్తమ సహాయ నటుడు: రవితేజ (వాల్తేరు వీరయ్య), బ్రహ్మానందం (రంగమార్తాండ)
ఉత్తమ సహాయ నటి: రూప లక్ష్మీ (బలగం)
ఉత్తమ గాయకుడు: శ్రీరామచంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. బేబీ)
ఉత్తమ గాయని: శ్వేత మోహన్‌ (మాస్టారు.. మాస్టారు.. సార్‌)
ఉత్తమ గేయ సాహిత్యం: అనంత్‌ శ్రీరామ్‌ (ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. బేబీ)
ఉత్తమ సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌ (బేబీ)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: సత్యన్‌ సూరన్‌ (దసరా)
ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: కొల్లా అవినాష్‌ (దసరా)
ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్‌ రక్షిత్‌ (ధూమ్‌ ధామ్‌ దోస్తానా.. దసరా)
69వ శోభ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌ 2024 తమిళ చిత్రాల విజేతలు వీళ్లే

ఉత్తమ చిత్రం: చిత్త (తెలుగులో చిన్నా)
ఉత్తమ నటుడు: విక్రమ్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌2)
ఉత్తమ నటి: నిమేషా సజయన్‌ (చిత్త)
ఉత్తమ దర్శకుడు: ఎస్‌యూ అరుణ్‌ కుమార్‌ (చిత్త)
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌): వెట్రిమారన్‌ (విడుదలై పార్ట్‌-1)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): సిద్ధార్థ్‌ (చిత్త)
ఉత్తమ నటి (క్రిటిక్స్‌): ఐశ్వర్య రాజేశ్‌ (ఫర్హానా), అపర్ణ దాస్‌ (దాదా)
ఉత్తమ సహాయ నటుడు: ఫహద్‌ ఫాజిల్‌ (మామన్నన్‌)
ఉత్తమ సహాయ నటి: అంజలి నాయర్‌ (చిత్త)
ఉత్తమ గాయకుడు: హరిచరణ్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌2)
ఉత్తమ గాయని: కార్తికా వైద్యనాథన్‌ (చిత్త)
ఉత్తమ గేయ సాహిత్యం: ఇలంగో కృష్ణన్‌ (అగ నగ.. పొన్నియిన్‌ సెల్వన్‌2)
ఉత్తమ సంగీతం: దిబు నినాన్‌ థామస్‌, సంతోష్‌ నారాయణన్‌ (చిత్త)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: రవి వర్మన్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌2)
ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: తోట తరణి (పొన్నియిస్‌ సెల్వన్‌2)

Read Also : Friendship Day 2024: రాజకీయంలో శాశ్వత మిత్రులు