Site icon HashtagU Telugu

నాగ చైతన్య- సమంత విడిపోవడానికి కేటీఆరే కారణం – మంత్రి కొండా సురేఖ

Sam Chaitu

Sam Chaitu

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఫై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగ చైతన్య- సమంత విడిపోవడానికి కేటీఆరే కారణమని అని తెలిపి షాక్ ఇచ్చింది. ఏమాయ చేసావే తో జోడి కట్టిన నాగ చైతన్య – సమంత (Naga Chaitanya and Samantha)లు నిజ జీవితంలో కూడా జోడి కట్టిన విషయం తెలిసిందే. మొదటి సినిమా తర్వాత ప్రేమలో పడిన వీరిద్దరూ కొన్నేళ్ల పాటు రహస్యంగా ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెళ్లి పీటలు ఎక్కారు. వీరి జంట చూసి ఎన్ని జంటలు కుల్లుకున్నాయో..ఎంతమంది ఈర్ష పడ్డారో తెలియంది కాదు..అక్కినేని వంటి పెద్ద ఫ్యామిలీ లో సమంత అడుగుపెట్టడం ఆమె అదృష్టమని అంత మాట్లాడుకున్నారు. పెళ్లి తర్వాత కొంతకాలం పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో పలు గొడవలు జరిగి..చివరకు విడాకులు (Divorce ) తీసుకునే వరకు వచ్చింది. ఇద్దరు కూడా ఇష్టంగా విడాకులు తీసుకుంటున్నట్లు తెలిపి..ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు. ఎందుకు విడాకులు తీసుకున్నారో చెప్పకపోయినప్పటికీ, అభిమానులు మాత్రం రకరకాలుగా మాట్లాడుకున్నారు.

ఈ తరుణంలో మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసి..అభిమానులకు షాక్ ఇచ్చింది. టాలీవుడ్ రియల్ లైఫ్ కపుల్ నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకోవటానికి కేటీఆరే కారణమని ఆరోపించారు. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో అనేక మంది సినిమా హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని , హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయడం.. హీరోయిన్లకు మత్తు పదార్థాలు అలవాటు చేసి వారి జీవితాలను నాశనం చేసాడని సురేఖ ఆరోపించింది. హీరోయిన్లు త్వరగా పెళ్లిళ్లు చేసుకోని వెళ్లిపోవటానికి కేటీఆర్ కారణమని తెలిపింది. హీరోయిన్ల జీవితాలను కేటీఆర్ నాశనం చేసాడని, ఈ విషయం టాలీవుడ్‌లోని పెద్దలందరికీ తెలుసనీ సురేఖ పేర్కొంది. దొంగ ఏడుపులు ఏడవటానికి నాకేం అవసరం. కేటీఆర్‌కు తల్లి, అక్క, చెల్లి, కూతురు లేరా?’ అని ఆమె ప్రశ్నించారు.

బాపూఘాట్‌లో గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దుబాయ్ నుంచి మూడు అకౌంట్ల ద్వారా తనపై ట్రోలింగ్ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టమని కేటీఆర్ తన టీమ్‌కు చెప్పారని , గతంలో గిరిజన మహిళా మంత్రి సీతక్క, మేయర్ విజయలక్ష్మి మీద కూడా అసభ్యంగా పోస్టులు పెట్టించారని విమర్శించారు. ఇప్పుడు బీసీ మహిళైన తనను కూడా కించపరుస్తూ పోస్టులుపెట్టడం బాధాకరమని వాపోయారు.

Read Also : Ponguleti Srinivas Reddy : ఈడీ మౌనం వెనుక కారణం ఏంటి..? – కేటీఆర్