Balagam Movie : బలగం సినిమాపై అసెంబ్లీలో కేటీఆర్ వ్యాఖ్యలు.. తెలంగాణ అంతలా మారింది అంటూ..

మానవ సంబంధాల గురించి చెప్తూ తెలంగాణ సినిమాగా తెరకెక్కిన బలగం భారీ విజయం సాధించింది. తాజాగా బలగం సినిమా గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడారు.

Published By: HashtagU Telugu Desk
KTR Comments on Balagam Movie in Assembly

KTR Comments on Balagam Movie in Assembly

ప్రస్తుతం తెలంగాణ(Telangana) వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అనేక అంశాలపై అసెంబ్లీ(Assembly)లో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ పల్లెల అభివృద్ధి గురించి మాట్లాడుతూ కేటీఆర్(KTR) బలగం సినిమా గురించి వ్యాఖ్యలు చేశారు.

కమెడియన్ వేణు(Venu) దర్శకుడిగా మారి ప్రియదర్శి(Priyadarshi), కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyan Ram) జంటగా దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి నిర్మాణంలో బలగం(Balagam) సినిమా తెరకెక్కింది. మంచి కుటుంబ విలువలతో, మానవ సంబంధాల గురించి చెప్తూ తెలంగాణ సినిమాగా తెరకెక్కిన బలగం భారీ విజయం సాధించింది. ఈ సినిమాని ప్రేక్షకులతో పాటు తెలంగాణ నాయకులు కూడా అభినందించారు. తాజాగా బలగం సినిమా గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడారు.

కేటీఆర్ బలగం సినిమా గురించి మాట్లాడుతూ.. ఒకప్పుడు కరువు నేలల గురించి చూపించాలంటే తెలంగాణ, రాయలసీమ పల్లెటూళ్ళని చూపించేవాళ్ళు సినిమా వాళ్ళు. కానీ ఇప్పుడు పచ్చని పొలాలు, ప్రకృతి అందాలు చూపించాలంటే తెలంగాణ పల్లెటూళ్లని వెతుక్కుంటూ వస్తున్నారు సినిమా వాళ్ళు. మా సిరిసిల్ల బిడ్డ డైరెక్టర్ వేణు ఎల్దండి బలగం అనే సినిమా తీశాడు. నన్ను ఈవెంట్ కి వచ్చి సపోర్ట్ అడిగాడు. మన సిరిసిల్లలోనే ఈవెంట్ జరిగింది. బలగం సినిమాలో మానవ అనుభందాలని చక్కగా చూపించి విజయం సాధించారు. ఆ సినిమా షూటింగ్ అంతా రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేట మండలంలో తీశారు. ఆ సినిమా కుటుంబం అంతా కలిసి చూశాము. సినిమా చూసిన తర్వాత అందరూ ఈ సినిమా నిజంగానే తెలంగాణలోనే తీశారా? అది కోనరావు పేట లేదా కోనసీమ అని అడుగుతున్నారు. తెలంగాణ కరువు సీమలు అన్నీ అంతలా మారి ఇప్పుడు కోనసీమలా అయ్యాయి అంటూ వ్యాఖ్యలు చేశారు.

 

Also Read : Nagarjuna : అమల కడుపుతో ఉన్నప్పుడు ఆరు నెలలు సినిమాలకు దూరంగా ఉన్నాను.. ఎమోషనల్ అయిన నాగార్జున..

 

 

  Last Updated: 06 Aug 2023, 08:39 PM IST