టాలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్ లో ఒకరైన కె ఎస్ బాబీ (KS Bobby) ప్రస్తుతం బాలకృష్ణ (Balakrishna)తో డాకు మహారాజ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి తన మార్క్ మాస్ ఫీస్ట్ ఇవ్వలని చూస్తున్నాడు. రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై సూపర్ బజ్ ఏర్పరచింది. ఐతే కె ఎస్ బాబీ తన నెక్స్ట్ సినిమాల గురించి చెప్పుకొచ్చారు. బాలయ్య సినిమా తర్వాత తాను రెండు భారీ సినిమాలు చేయబోతున్నట్టు వెల్లడించారు.
బాబీ లైన్ లో చిరంజీవి, రజినీకాంత్ సినిమాలు ఉన్నట్టు తెలుస్తుంది. రజినీకాంత్ తో సినిమా చేయాలని ఉందని దానికి స్టోరీ రెడీ అవుతుందని అన్నాడు బాబీ. అంతేకాదు చిరంజీవితో సినిమా కూడా ఉంటుందని చెప్పాడు. ఆల్రెడీ చిరుతో వాల్తేరు వీరయ్య సినిమా చేసి హిట్ అందుకున్నాడు బాబీ.
పవర్ సినిమాతో డైరెక్టర్ గా టర్న్ తీసుకున్న కె ఎస్ బాబీ తన మాస్ సినిమాలతో అదరగొట్టేస్తున్నాడు. బాబీ సినిమాల లైనప్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. డాకు మహారాజ్ (Daku Maharaj) తో మరోసారి మాస్ మేనియా చూపించాలని చూపిస్తున్న బాబీ రాబోతున్న సినిమాలతో కూడా మెగా మాస్ ట్రీట్ అందించాలని చూస్తున్నాడు. రజిని సినిమా కన్ఫర్మ్ అయితే బాబీ పేరు పాన్ ఇండియా లెవెల్ లో మారుమోగుతుందని చెప్పొచ్చు. డాకు మహారాజ్ హిట్ పడితే మాత్రం బాబీ డైరెక్షన్ స్టామినా ఏంటన్నది మరోసారి ప్రూవ్ అవుతుంది. సినిమాపై నందమూరి ఫ్యాన్స్ అంచనాలు భారీగా పెట్టుకున్నారు.