Site icon HashtagU Telugu

Kriti Shetty: సమంత ఐటెం సాంగ్ పై కృతి శెట్టి షాకింగ్ కామెంట్స్

Krithi Shetty

Krithi Shetty

పుష్ప (Pushpa) మూవీలో ఊ అంటావా పాట ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. బాలీవుడ్ స్టార్స్ సైతం ఈ ఐటెం సాంగ్ కు ఫిదా అయ్యారు. ఇక యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న పాటగా రికార్డులు క్రియేట్ చేసింది. అలాంటి పాటపై టాలీవుడ్ హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కస్టడీ సినిమా ప్రమోషన్ లో కృతి శెట్టి సమంత సాంగ్ గురించి మాట్లాడారు. తాను అలాంటి పాటలకు దూరమని తేల్చి చెప్పింది.

‘‘నన్ను అలాంటి పాటలకు అడిగితే ప్రస్తుతానికి అంగీకరించే స్థితిలో లేను. అలాంటి పాటలు ఎలా చేయాలన్న అవగాహన కూడా నాకు లేదు. ఇప్పటి వరకు నా కెరీర్లో నేను తెలుసుకున్నది ఒక్కటే. మనకు సౌకర్యంగా అనిపించనపుడు ఏదీ పడితే అది చేయకూడదు. కానీ నాకు ఊ అంటావా పాట ఇష్టమే. అందులో సమంత (Samantha) అద్భుతంగా డ్యాన్స్ చేశారు’’ అని రియాక్ట్ అయ్యింది.

‘శ్యామ్ సింగ రాయ్’లో లిప్ లాక్ (Lip Lock), ఇంటిమేట్ సీన్లు చేయడానికి తాను బాగా ఇబ్బంది పడ్డట్లు కృతి ఈ సందర్భంగా వెల్లడించింది. ‘‘ఆ సినిమాలో కొన్ని రొమాంటిక్ సీన్లలో నేను వంద శాతం మనస్ఫూర్తిగా నటించలేకపోయాను. హార్ట్ ఫుల్‌గా చేయాలని అనిపించనుపుడు వాటిని వదిలేయడమే బెటర్ అనే విషయాన్ని అప్పుడే తెలుసుకున్నా. భవిష్యత్తులో ఈ విషయాన్ని గుర్తు పెట్టుకునే ముందుకు సాగుతా’’ అని కృతి (Kriti Shetty) చెప్పింది.

Also Read: Sreeleela First Look: మెగా హీరోతో శ్రీలీల రొమాన్స్.. ఫస్ట్ లుక్ ఇదిగో