Site icon HashtagU Telugu

Ram Charan: చెర్రీకి జోడిగా మరో బాలీవుడ్ హీరోయిన్.. ఆమె ఎవరో తెలుసా?

Mixcollage 13 Mar 2024 09 55 Am 4642

Mixcollage 13 Mar 2024 09 55 Am 4642

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం చెర్రీ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈ మూవీలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇకపోతే చెర్రీ ఫ్యాన్స్ చరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కొన్నాళ్లుగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలోనే నటిస్తున్నాడు చరణ్. ఇందులో ద్విపాత్వాభినయం చేయనున్నాడని టాక్ వినిపిస్తుంది. తొలిసారి రాజకీయ నాయకుడి అలాగే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. ఇందుకు సంబంధించిన ఫోటోస్ కూడా లీక్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెల కొన్నాయి. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు సనతో ఒక ప్రాజెక్ట్ చేయనున్నారు చరణ్. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇందులో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించనున్నట్లు ఇది వరకే మూవీ మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.

ఇక ఇప్పుడు ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని అందులో మరో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కనిపించనుందని సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో వైరల్ అవుతుంది. కానీ ఇందులో ఎంతవరకు నిజముందనేది మాత్రం తెలియరాలేదు. చరణ్, బుచ్చిబాబు ప్రాజెక్టులో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటుందని తెలియడంతో ఇప్పుడీ ప్రాజెక్ట్ పై మరింత క్యూరియాసిటి నెలకొంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.