Site icon HashtagU Telugu

Kriti Sanon dating Prabhas: ప్రభాస్ తో కృతి సనన్ డేటింగ్.. రిలేషన్ పై బాలీవుడ్ హీరో రియాక్షన్!

Kriti

Kriti

ఆదిపురుష్ జంట కృతి సనన్, ప్రభాస్‌ గురించి పలు వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తాను ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటానని కృతి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే వీరి సంబంధాన్ని బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ దాదాపుగా బయటపెట్టేశాడు. ఇటీవల, జరిగిన ఓకార్యక్రమంలో వరుణ్, కృతి తమ కొత్త చిత్రం ‘బేడియా’ని ప్రమోట్ చేసిన సమయంలో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

కృతి సనన్ ప్రియుడు ప్రస్తుతం ముంబై లేడనీ, హైదరాబాద్ ఉన్నాడని (కృతి కా నామ్ ఇసిలియే నహీ థా క్యుంకీ కృతి కా నామ్ కిసీ కే దిల్ మే హై. ఏక్ ఆద్మీ హై జో ముంబై మే నహీ హై) ఈ బాలీవుడ్ బ్యూటీనుద్దేశించి కామెంట్స్ చేశాడు. వారు డేటింగ్ కూడా చేస్తున్నారని ఈ బాలీవుడ్ హీరో తేల్చి మరి చెప్పాడు. ప్రభాస్, కృతి సనన్ సీరియస్‌ రిలేషన్ ఉన్నారని, త్వరలో వారి సంబంధాన్ని నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లవచ్చని, అందుకు వారి తల్లిదండ్రులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మరికొందరు రియాక్ట్ అయ్యారు.

ఇదే విషయాన్ని ఉమైర్ సంధు అనే సినీ క్రిటిక్ తన ట్విట్టరలో పోస్ట్ చేశాడు. ఆదిపురుష్ షూటింగ్ సమయంలోనే ప్రభాస్ కృతికి ప్రపోజ్ చేశాడని, వారు రిలేషన్ లో ఉన్నారని, త్వరలో ఎంగేజ్ మెంట్ కూడా జరిగే అవకాశాలున్నాయని ట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయమై డార్లింగ్ ప్రభాస్ క్లారిటీ ఇస్తాడో లేదో వేచి చూడాల్సిందే. అయితే గతంలో వీరిద్దరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Exit mobile version