Site icon HashtagU Telugu

Kriti Sanon Autumn Wear: అదిరేటి డ్రస్సు నేనేస్తే.. ష్యాషన్ డ్రస్సులతో ఆకట్టుకుంటున్న కృతి!

Kruthi

Kruthi

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ మంచి నటి మాత్రమే కాదు.. ఫ్యాషన్ ఐకాన్ కూడా. ఆమె వేసుకునే డ్రస్సులు ఫ్యాషన్ కు పర్యాయపదంగా నిలుస్తాయి. అందుకే చాలామంది అమ్మాయిలు ఫ్యాషన్ విషయంలో ఈ బ్యూటీని ఫాలో అవుతున్నారు. వచ్చే నెలలో దసరా, దీపావళి పండగలు రానున్నాయి. ఈ డ్రస్సులు అయితే బాగుంటాయి అని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ బాలీవుడ్ బ్యూటీ డ్రస్సులపై లుకేయ్యండి. మోడ్రన్ దుస్తులు అయినా, ట్రెడిషనల్ కాస్టూమ్స్ అయినా కృతికి ఇట్టే సరిపోతాయి.

దేశంలోనే ప్రసిద్ధ బ్రాండ్ రంగృతి ఈ సంవత్సరానికి డిఫరెంట్ ట్రెడిషనల్, వెస్టన్ దుస్తులతో మన ముందుకు రాబోతోంది. రంగృతితో కృతి  కలిసి పనిచేయబోతోంది. “రంగృతి భారతీయ దుస్తులను ఫ్యాషన్‌గా, సౌకర్యవంతంగా మారుస్తుంది. ఇది మహిళల రూపాన్ని మరింత పెంచుతుంది. భారతీయ ఫ్యాషన్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి రంగృతితో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను’’ అంటూ ప్రకటించింది.

ట్రెండ్‌లను పునర్నిర్వచించడాన్ని విశ్వసించే బ్రాండ్ రంగృతి మహిళల కోసం ఎన్నో రకాల కాస్ట్యూమ్స్ డిజైన్ చేయబోతోంది. ‘శరదృతువు-శీతాకాల సేకరణ’ అనే కాన్పెస్ట్ తో మహిళల మదిని దొచే డస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. కృతి కూడా ఆమోదించే ఫ్యాషన్ ఎస్కేప్‌లో ఇది ఒకటి.

Exit mobile version