Krithi Shetty Photoshoot : వర్షంలో తడిచిన అందాలతో కృతి శెట్టి..

కృతి శెట్టి..వర్షంలో తడిచిన అందాలతో యూత్ కు నిద్ర లేకుండా చేస్తుంది.

Published By: HashtagU Telugu Desk
krithi shetty photoshoot

krithi shetty photoshoot

ఉప్పెన మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచమైన కృతి శెట్టి (Krithi Shetty)..వర్షంలో తడిచిన అందాలతో యూత్ కు నిద్ర లేకుండా చేస్తుంది. మొదటి సినిమాతోనే యూత్ ను ఆకట్టుకున్న కృతి..ఆ తర్వాత శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు మూవీస్ తో వరుస హిట్స్ కొట్టి గోల్డెన్ గా లెగ్ గా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో అమ్మడికి వరుస ఛాన్సులు తలుపు తట్టాయి. కానీ ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా భారీ డిజాస్టర్లు కావడం తో ప్రస్తుతం అమ్మడికి ఛాన్సులు లేకుండా పోయాయి. దీంతో సోషల్ మీడియా ను గట్టిగా నమ్ముకుంది. కెరియర్ మొదట్లో అందాల ఆరబోత కు పెద్దగా ఇంట్రస్ట్ చూపించని ఈ భామ..ఇప్పుడు అందాల ఆరబోత కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అంతే కాదు సోషల్ మీడియా లోను ఎప్పటికప్పుడు హాట్ , హాట్ ఫోటో షూట్స్ ( Photoshoot) తో కనువిందు చేస్తుంది.

తాజాగా అడవిలో ఫోటోషూట్ చేసింది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా..అవి వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫొటోస్ లలో కృతి (Krithi Shetty) ఎంతో క్యూట్ గా కనిపిస్తోంది. చిన్నపిల్లలా వర్షంలో తడుస్తూ , ఎంజాయ్ చేస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. వర్షం లో కృతి కూల్ కూల్ గా ఉంటే.. మరోవైపు ఆమె పిక్స్ మాత్రం యూత్ లో వేడిసెగలు పుట్టిస్తున్నాయి. రీసెంట్ గా ఈమె క‌స్టడీ సినిమాతో తెలుగు, త‌మిళ భాష‌ల్లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది. రెండు భాష‌ల్లో ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం మ‌ల‌యాళంలో టోవినో థామ‌స్‌కు జోడీగా ఏఆర్ ఎమ్ అనే సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాతోనే మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.

Read Also : Annapurna Photo Studio: చైతూ ఖాతాలో హిట్ .. ఆకట్టుకుంటున్న అన్నపూర్ణ ఫోటో స్టూడియో

  Last Updated: 22 Jul 2023, 02:47 PM IST