ఉప్పెన (Uppena) తో తెరంగేట్రం తోనే సూపర్ హిట్ అందుకున్న కృతి శెట్టి ఆ క్రేజ్ తో అదిరిపోయే రేంజ్ లో ఛాన్స్ లు అందుకుంది. ఐతే వాటిలో నానితో చేసిన శ్యాం సింగ రాయ్ తప్ప మరో సినిమా పెద్దగా ఆడింది లేదు. ఎన్నో ఆశలతో వరుస సినిమాలు చేసినా సరే అమ్మడికి నిరాశమిగిలింది. తెలుగులో ఎలాగు వర్క్ అవుట్ కావట్లేదని తమిళ్ లో ట్రై చేస్తుంది అమ్మడు. అక్కడ రెండు సినిమాల్లో ఛాన్స్ అందుకున్న కృతి శెట్టి వాటి మీదే ఫుల్ ఫోకస్ పెట్టింది.
ఈమధ్యనే మలయాళంలో ఒక సినిమా చేసిన అమ్మడు అక్కడ కూడా సోసోగానే క్రేజ్ సంపాధించింది. కృతి శెట్టి (Krithi Shetty) కెరీర్ ఆశించిన విధంగా జోరు కొనసాగించట్లేదు. ఐతే ఓ పక్క వచ్చిన సినిమా చేస్తూ మరోపక్క ఆడియన్స్ ని ఆకట్టుకునేందుకు ట్రై చేస్తుంది అమ్మడు. ఫోటో షూట్స్ తో ఈమధ్య గ్లామర్ డోస్ పెంచి సత్తా చాటుతుంది బేబమ్మ (Bebamma).
అమ్మడు శారీ లుక్స్..
అందులో భాగంగానే లేటెస్ట్ గా అమ్మడు శారీ లుక్స్ తో అదరగొడుతుంది. శారీ లో సూపర్ అనిపించేలా ఉన్న అమ్మడు తన లుక్స్ తో కుర్రాళ్ల హృదయాల్లో గెలిగింతలు పెట్టేస్తుంది. అమ్మడి ఖాతాలో మరో సూపర్ హిట్ సినిమా పడితే మళ్లీ తిరిగి ఫాం లోకి వస్తుందని చెప్పొచ్చు.
ప్రస్తుతానికి తెలుగులో ఒక్క ఆఫర్ కూడా అందుకోలేకపోతున్న కృతి శెట్టి ఎవరైనా ఛాన్స్ ఇస్తారేమో అని ఎదురుచూస్తుంది. ఈలోగా తన ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంది.
Also Read : Diwali: దివాళి రోజు ఏ దిక్కున దీపాలను వెలిగిస్తే మంచిదో తెలుసా?