తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న కృతి శెట్టి ఆ క్రేజ్ తో వచ్చిన ప్రతి సినిమా చేస్తూ వచ్చింది. ఐతే ఆ సినిమాలన్నీ చేశాక ఫలితాలు అమ్మడి మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాయి. హిట్ (Hit) పడినప్పుడు వరుస ఛాన్సులు రావడం కామనే. ఈ క్రమంలో కృతి శెట్టి వచ్చిన వాటిలో ఏది కెరీర్ కు హెల్ప్ అవుతుంది అన్నది ఆలోచించలేకపోయింది. ఈ క్రమంలో కృతి శెట్టి వరుస ఫ్లాపులు మూట కట్టుకుంది.
ఐతే చివరగా ఈ ఇయర్ మనమే సినిమాతో లక్ టెస్ట్ చేసుకున్న అమ్మడు అది కూడా నిరాశ పరచడంతో ఇక లాభం లేదు అనుకుని టాప్ గేర్ వేసింది. తెలుగులో ఎలాగైనా ఛాన్సులు రాబట్టు కోవాలని చూస్తున్న అమ్మడు ఫోటో షూట్స్ తో రచ్చ రచ్చ చేస్తుంది. ఐతే తనకు ఇప్పుడు కోలీవుడ్ నుంచి వరుస అవకాశాలు వస్తున్నాయి. అందుకే అక్కడ ఫోకస్ చేస్తే బెటర్ అనుకుంటుంది అమ్మడు.
ఇప్పటికే తమిళం నుంచి రెండు ఆఫర్లు కృతి (Krithi Shetty) కి వచ్చాయి. అందులో ఒకటి ఎల్.ఐ.కె కాగా.. మరోటి జినీ ఒకటి. జయం రవి సినిమా లో నటిస్తున్న అమ్మడికి అక్కడ లక్ ఎలా ఉంటుందో చూడాలి. తెలుగులో బేబమ్మ గా క్రేజ్ తెచ్చుకుని దాన్ని సరిగా వాడుకోలేని కృతి శెట్టి కోలీవుడ్ లో వస్తున్న ఆఫర్ల గురించి మాత్రం ఫుల్ ఫోకస్ గా చేస్తుంది.
అక్కడ అసలేమాత్రం తొందర పడకుండా మంచి కథ బలం ఉన్న సినిమాలనే చేయాలని చూస్తుంది. ఇదే క్రమంలో అమ్మడికి మలయాళం (Malayalam) నుంచి కూడా ఒక అదిరిపోయే ఆఫర్ వచ్చింది. మరి రాబోతున్న ఈ సినిమాలతో అయినా అమ్మడు తిరిగి ఫాం లోకి వస్తుందేమో చూడాలి. తెలుగులో కూడా ఒక మంచి హిట్ సినిమాతో కంబ్యాక్ ఇవ్వాలని చూస్తుంది కృతి శెట్టి.
Also Read : Samantha : నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో సమంత..?