Krithi Shetty : కన్నడ భామ కృతిశెట్టి తెలుగులో ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత వరుస సినిమాలు హిట్ కొట్టినా వెంటవెంటనే ఫ్లాప్స్ కూడా చూసింది. దీంతో టాలీవుడ్ లో కృతిశెట్టికి అవకాశాలు కరువయ్యాయి. అసలు తెలుగులో కృతిశెట్టికి ప్రస్తుతం ఒక్క సినిమా కూడా లేదని సమాచారం.
అయితే కృతిశెట్టిని టాలీవుడ్ వదిలేసినా తమిళ్, మలయాళ భాషల్లో బిజీ అవుతుంది. ఇటీవల మలయాళంలో టోవినో థామస్ సరసన ARM సినిమాలో నటించింది. ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిలా కనిపించి మళయాళంతో పాటు వేరే భాష ప్రేక్షకులను కూడా మెప్పించింది. ARM సినిమా 100 కోట్లు సాధించి పెద్ద హిట్ అయింది. దీంతో మలయాళంలో ఈ అమ్మడికి అవకాశాలు క్యూ కట్టాయట. ఇప్పటికే మలయాళంలో ఇంకో సినిమాకు కూడా సైన్ చేసిందని సమాచారం.
ఇక తమిళ్ లో కూడా బిజీ అవుతుంది ఈ భామ. ప్రదీప్ రంగనాథన్ సరసన LIK అనే సినిమాలో నటిస్తుంది. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇది కాకుండా కార్తీతో పాటు మరో సినిమా కుడా తమిళ్ లో ఉందట. ఇలా కృతిశెట్టికి తమిళ్, మలయాళంలో ఆల్మోస్ట్ 5 సినిమాలు చేతిలో ఉన్నాయి. మరి టాలీవుడ్ లో వెలిగినట్టే అక్కడ కూడా స్టార్ హీరోయిన్ అవుతుందా చూడాలి. మళ్ళీ టాలీవుడ్ లో ఎప్పుడు కనిపిస్తుందో అని కృతి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా ఫొటోషూట్స్ తో అలరిస్తూనే ఉంది.
Also Read : Lady Aghori Naga Sadhu : పవన్ కల్యాణ్‌కు ఆశీస్సులు తెలిపిన లేడీ అఘోర..