Site icon HashtagU Telugu

Krithi Shetty: మళ్లీ ఫామ్ లోకి వస్తున్న ఉప్పెన హీరోయిన్.. ఒకేసారి రెండు క్రేజీ ఆఫర్స్?

Mixcollage 13 Feb 2024 07 44 Am 2804

Mixcollage 13 Feb 2024 07 44 Am 2804

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఉప్పెన సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఇంటి ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే భారీగా పాపులారిటీని సంపాదించుకుంది. ఉప్పెన సినిమాతో ఉప్పెనలా దూసుకు వచ్చింది. ఉప్పెన సినిమా తర్వాత ఈమెకు వరుసగా అవకాశాలు క్యూ కట్టడంతో నితిన్ తో మాచర్ల నియోజకవర్గం, నాగ చైతన్యతో కస్టడీ, బంగార్రాజు, రామ్ పోతినేనితో ది వారియర్, నానితో శ్యామ్ సింగరాయ్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో కృతి శెట్టి ఎటువంటి సినిమాలలో నటించలేదు.

మొదట్లో ఈ ముద్దుగుమ్మకు వచ్చిన ఆ విధంగా అవకాశాలు రావడం లేదు. ఈ చిన్నది నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. దాంతో కృతి శెట్టి ఆఫర్స్ దక్కాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడికి మరో రెండు క్రేజీ ఆఫర్స్ వచ్చాయట. తెలుగులో శర్వానంద్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైందని తెలుస్తోంది. అలాగే తమిళ్ లోనూ ఒక సినిమా చేస్తోందట హీరోయిన్ కృతి శెట్టి. జయం రవి హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. మొత్తానికి కృతి శెట్టి మళ్ళీ ఫామ్ లోకి వస్తున్నట్లు తెలుస్తోంది.

కృతి శెట్టి మళ్ళీ సినిమాలలో బిజీ బిజీ అవ్వాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ రెండు ప్రాజెక్ట్స్ సక్సెస్ అయితే మాత్రం కృతి శెట్టి కెరియర్ గాడిలో పడ్డట్టే అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ మధ్యకాలంలో కృతి శెట్టి కి సరైన విధంగా సినిమా అవకాశాలు లేకపోవడంతో ఎక్కువగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ వెళ్తూ సందడి సందడి చేస్తోంది.